WATER TO TIRUMALA FROM BALAJI RESERVOIR- TTD CHAIRMAN_ భ‌విష్య‌త్తులో బాలాజి రిజ‌ర్వాయ‌ర్ నుండి తిరుమ‌ల‌కు నీటి స‌ర‌ఫ‌రా : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirupati, 6 Sep. 19: To meet the water needs of devotees visiting Tirumala, plans are in offing on how to draw the waters from Balaji Reservoir, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

After an inspection of the Balaji reservoir with TTD officials on Friday evening, he said the feasibility was being studied for bringing water via Mallemadugu to Kalyani dam as the reservoir has a link to Galeru Nagari project. The reservoir also has a catchment area of 75 km in the Seshachala hillocks and has one tmc of water availability.

He said it was the commitment of the AP Chief Minister Sri YS Jaganmohan Reddy to ensure a permanent solution to the water needs of the multitude of devotees who throng Tirumala every day.

He said the proposal would be placed before the TTD board and implemented on war footing to resolve the water needs of the Tirumala shrine permanently.

Brushing aside the mudslinging acts of the opposition parties, the Chairman said, there is no harm to the sanctity and serenity of Tirumala. “Since the AP CM belongs to other faith, the opposition is leaning to mean tactics by spreading false news on evangelism. But people are watching everything. I urge all not to believe in such false propaganda”, he maintained.

Local MLA Sri B Karunakar Reddy, Tirumala Special Officer Sri AV Dharma Reddy, CE Sri Ramachandra Reddy, and others were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భ‌విష్య‌త్తులో బాలాజి రిజ‌ర్వాయ‌ర్ నుండి తిరుమ‌ల‌కు నీటి స‌ర‌ఫ‌రా : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుపతి, 2019 సెప్టెంబ‌రు 06: ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ధార్మిక క్షేత్ర‌మైన తిరుమ‌ల‌కు నీటి స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగా అరిక‌ట్టేందుకు తిరుప‌తి స‌మీపంలోని బాలాజి రిజ‌ర్వాయ‌ర్ నుండి రాబోయే రోజుల్లో నీటిని స‌ర‌ఫ‌రా చేసేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ నీటిపారుద‌ల శాఖ అధికారులు, టిటిడి ఇంజినీరింగ్ అధికారుల‌తో క‌లిసి శుక్ర‌వారం సాయంత్రం బాలాజి రిజ‌ర్వాయ‌ర్‌ను ఛైర్మ‌న్ ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌ల‌కు నీటి స‌మ‌స్య‌ను తీర్చాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ. శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేర‌కు ప‌లుమార్లు ప్ర‌భుత్వ నీటిపారుద‌ల శాఖ అధికారులతో, టిటిడి ఇంజినీరింగ్ అధికారుల‌తో చ‌ర్చించామ‌న్నారు. బాలాజి రిజ‌ర్వాయ‌ర్ నుండి మ‌ల్లిమ‌డుగు మీదుగా క‌ల్యాణి డ్యామ్‌కు నీటిని త‌ర‌లించేందుకు అనువుగా ఉంటుంద‌ని నీటిపారుద‌ల శాఖ అధికారులు ప్రాథ‌మికంగా నిర్ధారించార‌ని తెలిపారు. క‌ల్యాణి డ్యామ్ నుండి నీటిని తిరుమ‌ల‌కు పంపింగ్ చేస్తామ‌న్నారు. బాలాజి రిజ‌ర్వాయ‌ర్‌కు గాలేరు-న‌గ‌రి ప్రాజెక్టు నుండి కూడా నీరు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని, ఒక‌వేళ ఆ నీరు రాక‌పోయినా 75 కి.మీ నుండి 85 కి.మీ మేర క్యాచ్‌మెంట్ ఏరియా ఉండ‌డంతో ఎల్ల‌ప్పుడూ ఒక టిఎంసి నీరు నిల్వ ఉంటుందని వివ‌రించారు. కావున నీటి స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం ఉండ‌ద‌ని తెలియ‌జేశారు. త్వ‌ర‌లో టిటిడి బోర్డు ఏర్పాటు కానుంద‌ని, బోర్డు స‌మావేశంలో చ‌ర్చించి ఈ మేర‌కు ఈ ప‌నుల‌ను ముందుకు తీసుకెళ‌తామ‌ని తెలిపారు. కాగా, శేషాచ‌ల కొండ‌ల్లో చ‌ర్చి ఉన్న‌ట్టు, అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టు సామాజిక మాధ్య‌మాల్లో అస‌త్య ప్ర‌చారం చేసిన కొంతమందిని పోలీసులు అరెస్టు చేసిన‌ట్టు ఛైర్మ‌న్‌ తెలిపారు.

టిటిడి ఛైర్మ‌న్ వెంట తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డి, ఎస్ఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఇఇ శ్రీ ర‌విశంక‌ర్‌రెడ్డి ఇత‌ర టిటిడి, ప్ర‌భుత్వ అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.