BALAKANDA AKHANDA PARAYANAM HELD WITH RELIGIOUS FERVOUR _ భక్తిసాగరంలో ముంచెత్తిన బాలకాండ అఖండ పారాయ‌ణం

TIRUMALA, 25 DECEMBER 2022: The 14th Edition of Akhanda Balakanda Parayanam was observed with religious fervour at Nada Neerajanam Platform in Tirumala on Sunday.

This spiritual event took place between 8:30am and 10:30am and was telecasted live on SVBC for the sake of global devotees.

The Vedic Pundits and scholars led by Acharya Sri Prava Ramakrishna Somayajulu recited 159 Shlokas which included 134 from the chapters 66-70 of Balakanda from the epic Ramayana and 25 Shlokas from Yoga Vasistyam and Dhanwantari Maha Mantram seeking the well-being of the humanity.

Before the commencement of Parayanam, Annamacharya Project Senior Artist Sri Madhusudhan Rao and his team presented “Ramudu Nada china..” Keertan and the event concluded with ” Sri Hanuman Jaya Hanuman…” Bhajan.

Vedic Pundits, Faculties, Students, devotees participated in the event with utmost spiritual fervour.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

భక్తిసాగరంలో ముంచెత్తిన బాలకాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 25 డిసెంబరు, 2022: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం ఉద‌యం 8.30 నుండి 10.30 గంటల వరకు జరిగిన 14వ‌ విడ‌త బాల‌కాండ అఖండ పారాయ‌ణం భక్తిసాగరంలో ముంచెత్తింది. శ్రీ హనుమత్ సమేత సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల సమక్షంలో కార్యక్రమం ఆద్యంతం రామనామస్మరణతో సాగింది.

ఇందులో 66 నుండి 70 సర్గల వ‌ర‌కు గ‌ల 134 శ్లోకాలను పారాయణం చేశారు. యోగవాసిష్టం – ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాలు పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయ‌ణం చేయ‌గా ప‌లువురు భ‌క్తులు భ‌క్తిభావంతో వారిని అనుస‌రించి శ్లోక పారాయ‌ణం చేశారు.

ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ఆచార్య ప్రవా రామ‌కృష్ణ సోమ‌యాజి, ధర్మగిరి వేద పాఠశాల పండితులు శ్రీ కె.రామానుజాచార్యులు, శ్రీ పివిఎన్ఎన్.మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన  పండితులు పాల్గొన్నా‌రు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ గురజాడ మధుసూదనరావు బృందం కార్యక్రమం మొదట్లో “రాముడు నడిచిన వేళ హనుమంతుడు వెతకాల… చివర్లో “శ్రీ హనుమ జయ హనుమ….” భజన కీర్తనలను వీనులవిందుగా ఆలపించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.
           
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.