BALALAYA ASTABANDHANA MAHA SAMPROKSHANA OF BANGALORE SV TEMPLE FROM 9-11_ మే 9 నుండి 11వ తేదీ వరకు బెంగుళూరు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ

Tirupati, 22 April 2022: TTD is organising the Balalaya Astabandhana Maha Samprokshana fete at SV temple in Bengaluru from May 9-11 with Ankurarpanam on May 9 evening.

 

As part of the three-day celebrations, Chaturdasha Kalasa Sthapana and other vaidika programs will be held at yagashala on May 10 and Ammavaru Vigraha pratistapana and Asta Bandhanam will be performed in the evening.

 

Maha Shanti abhisekam will be conducted during the wee hours of May 11 followed by Maha Samprokshana fete in Mithuna lagnam.

 

Later in the evening Shanti kalyanam and procession of swami and ammavari utsava idols will be held. 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 9 నుండి 11వ తేదీ వరకు బెంగుళూరు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ

తిరుపతి, 2022 ఏప్రిల్ 22: బెంగుళూరు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 9 నుండి 11వ తేదీ వరకు బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ జరుగనుంది. ఈ కార్యక్రమానికి మే 9వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 10 గంటల వ‌ర‌కు అంకురార్పణ నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా మే 10వ తేదీ ఉద‌యం 8.30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, చ‌తుర్థ‌శ క‌ల‌శ స్థాప‌న నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న‌, అష్ట‌బంధ‌నం చేస్తారు.

మే 11వ తేదీ ఉద‌యం 6 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి అభిషేకం జ‌రుగ‌నుంది. ఉద‌యం 9.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు మిథున ల‌గ్నంలో మహాసంప్రోక్షణ నిర్వ‌హిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శాంతి క‌ల్యాణం, స్వామి, అమ్మ‌వార్ల ఊరేగింపు నిర్వ‌హించ‌నున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.