BALALAYA PROGRAM AT SRI VARAHA SWAMY TEMPLE _ శాస్త్రోక్తంగా శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయ బాలాలయ మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మాలు

Tirumala, 8 Dec. 20: Several vaidika activities were conducted at the Sri Varaha swamy temple on Day-3 of the ongoing Balalaya Maha Samprokshanam program at Tirumala on Tuesday.

As part of them were Punyahavachanam, Viswaksena Aradhana, Kumbha Aradhana, and Panchagavya Aradhana, followed by Sarva Daivaischa, Paramatmika and Shanti Homams.

Navakalasha Snapanam and other rituals were also performed to the galaxy of deities located in the premises of Sri Varaha Swamy temple.

Kankanabhattar Sri Venugopal Dikshitulu, Vaikhanasa Agama Advisors Sri SK Sundara Varadan, Sri Mohana Rangacharyulu, Sri Anantasayana Dikshitulu, temple chief archakas Sri Govindaraja Dikshitulu, Sri Krishna Sheshachala Dikshitulu and other Rutwiks and officials were present

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 శాస్త్రోక్తంగా శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయ బాలాలయ మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మాలు

తిరుమల, 2020 డిసెంబ‌రు 08: తిరుమల శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా మూడ‌వ రోజైన మంగ‌ళ‌‌వారం  శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలలో నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగ‌శాల‌లో హోమగుండాల‌ను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన,  కుంభారాధ‌న‌, పంచగవ్యారాధన నిర్వ‌హించారు. త‌రువాత  స‌ర్వ‌దైవ‌శ్చ‌‌హోమం, ప‌ర‌మాత్మిక హోమం, శాంతి హోమాలు జ‌రిగాయి.

కాగా, మంగ‌ళ‌‌వారంనాడు ఉదయం బాల‌ల‌యంలో ఉండే స్వామివారి దారు బింబ‌మున‌కు,  ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారికి, విష్వక్సేనులవారికి, భాష్య‌కారులవారికి‌, విమాన గోపురం న‌మూనాకు పంచ‌గ‌వ్యాధివాసం, క్షీరాధివాసం, జ‌లాధివాసం, న‌వ‌క‌ల‌శ స్న‌ప‌నం నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు, శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ర‌ద‌చార్యులు, శ్రీ ఎపి అనంతశ‌య‌న దీక్షితులు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ గోవింద‌రాజ దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, రుత్వికులు, అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.