BALALAYA SAMPROKSHANAM HELD FOR VARAHA SWAMY TEMPLE _   శాస్త్రోక్తంగా శ్రీ‌ వ‌రాహ‌స్వామివారి ఆలయ బాలాలయ సంప్రోక్షణ

Tirumala, 10 Dec. 20: Balalaya  Samprokshanam held for Sri Varaha Swamy temple at Tirumala on Thursday between 9am and 10:30am in the auspicious Makara Lagnam.

TTD EO Dr KS Jawahar Reddy who took part in this ritual along with Additional EO Sri AV Dharma Reddy speaking to media on the occasion, said that TTD has taken up the Gold Malam works of Gopuram of the ancient temple. For this we have conducted Balalayam fete and transferred the power in the presiding deity into Kumbham. In the coming four or five months we will complete the work. After Maha Samprokshanam, the temple will be opened for darshan of devotees”, he added.

Meanwhile, earlier in Yagashala of the temple, Kumbharadhana, Archana and other Vaidika Rituals performed. Later Maha Purnahuti was performed. 

Temple DyEO Sri Harindranath, VGO Sri Bali Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ‌ వ‌రాహ‌స్వామివారి ఆలయ బాలాలయ సంప్రోక్షణ

తిరుమల, 2020 డిసెంబ‌రు 10: తిరుమల శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో గురు‌‌‌వారం ఉద‌యం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ సంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈవో డాక్ట‌ర్ శ్రీ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి దంప‌తులు, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగ‌శాల‌లో వేంచేపు చేసిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని, శ్రీ వ‌రాహ‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌ను సుప్ర‌భాతంతో మేల్కొలిపి, పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన,  ప్ర‌ధాన కుంభారాధ‌న, అర్చ‌న‌ నిర్వ‌హించారు. అనంత‌రం శ్రీ వ‌రాహ‌స్వామివారి ప్ర‌ధాన హోమగుండ‌మైన స‌భ్య‌హోమ ‌గుండంలో మ‌హా పూర్ణాహూతి నిర్వ‌హించారు. త‌రువాత విమాన గోపురం, ద్వార పాల‌కులు, ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారికి, విష్వక్సేనులవారికి, భాష్య‌కారులవారి హోమ‌గుండాల‌లో మ‌హా పూర్ణాహూతి జ‌రిగింది.  

శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామివార్లు ప్ర‌బంధ శాత్తుమొర నిర్వ‌హించారు. ‌త‌రువాత సుమూహ‌ర్తంలో భ‌గ‌వ‌త్ వైఖాన‌స ఆగ‌మోక్తంగా ఆచార్య పురుషులు బాలాల‌యంలోని శ్రీ వ‌రాహ‌స్వామివారికి ప్రాణ ప్ర‌తిష్ట నిర్వ‌హించారు. 

 ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూయ‌బ‌డిన రాగి రేకులు అమర్చేందుకు బాలాల‌యం నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. బంగారు తాప‌డం ప‌నులు పూర్త‌వ్వ‌డానికి దాదాపు 5 నెల‌లు స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. కావున అప్ప‌టి వ‌ర‌కు భ‌క్తుల‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారి మూల విరామూర్తి ద‌ర్శ‌నం ఉండ‌ద‌న్నారు. ఇందుకోసం డిసెంబ‌ర్ 5వ తేదీ నుండి బాలాల‌యం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి, గురువారం ఉద‌యం బాలాల‌య సంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. తదుపరి మహా సంప్రోక్షణ జరుగువరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తార‌ని వివ‌రించారు. 
        
ఈ కార్య‌క్ర‌మంలో కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు, శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ర‌ద‌చార్యులు, శ్రీ ఎపి అనంతశ‌య‌న దీక్షితులు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ గోవింద‌రాజ దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, రుత్వికులు, అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.