BALALAYAM AT ALIPERI PADALA MANDAPAM _ ఫిబ్ర‌వ‌రి 24 నుండి 26వ తేదీ వ‌ర‌కు అలిపిరి పాదాల‌మండ‌పంలోని ఆలయాల బాలాల‌యం

Tirupati, 16 February 2020: TTD is organising Balalayam for all its temples near Padala mandapam at Alipiri from February 24-26 for which Ankurarpanam will be performed on February 23.

The Alipiri temple complex comprises of Sri Lakshmi Narayana Swamy temple, Sri Andal Ammavari temple, Sri Periyalwar temple and Sri Anjaneya temple. As a part of of Balalayam event on February 24, Akalmasha homam, laghu Purnahuti will be performed in the morning.

Later in the evening Punyahavachanam, Agni pratista, kalakarshana, kumbharadhana and Yukta homa will be conducted.

On February 25, Agnipranayanam, kumbharadhana, Akalmasha homam, laghu Purnahuti will be performed in the morning and in evening Maha Shanti Purnahuti and Mahashantiprokshana will be conducted.

On February 26, between 10:27am and 10:59 am in the auspicious Phalguna Suddha Mesha Lagnam Kumbhavahanam will be performed. Later devotees will be allowed for darshanam from 11.30am onwards.

Special Grade DyEO of Sri Govindarajaswamy temple Smt Varalakshmi is supervising the arrangements.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

ఫిబ్ర‌వ‌రి 24 నుండి 26వ తేదీ వ‌ర‌కు అలిపిరి పాదాల‌మండ‌పంలోని ఆలయాల బాలాల‌యం

తిరుప‌తి, 2020 ఫిబ్ర‌వ‌రి 16: తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద‌గ‌ల శ్రీ‌వారి పాదాల మండ‌పంలోని ఆల‌యాల‌కు ఫిబ్ర‌వ‌రి 24 నుండి 26వ తేదీ వ‌ర‌కు బాలాల‌యం జ‌రుగ‌నుంది. ఇందుకోసం ఫిబ్ర‌వ‌రి 23న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

పాదాల మండ‌పంలో శ్రీల‌క్ష్మీనారాయ‌ణ‌ స్వామివారి ఆల‌యం, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి ఆల‌యం, పెరియాళ్వార్ ఆల‌యం, శ్రీ భ‌క్తాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాలు ఉన్నాయి. బాలాల‌యంలో భాగంగా ఫిబ్ర‌వ‌రి 24న ఉద‌యం యాగ‌శాల‌లో అక‌ల్మ‌ష హోమం, ల‌ఘుపూర్ణాహుతి, సాయంత్రం పుణ్యాహ‌వ‌చ‌నంలో అగ్నిప్ర‌తిష్ట‌, క‌ళాక‌ర్ష‌ణ‌, కుంభారాధ‌న ఉక్త హోమాలు చేప‌డ‌తారు. ఫిబ్ర‌వ‌రి 25న ఉద‌యం అగ్నిప్ర‌ణ‌య‌ణం, చిత్ర‌ప‌టాల‌కు కుంభారాధ‌న‌, అక‌ల్మ‌ష‌హోమం, ల‌ఘుపూర్ణాహుతి, సాయంత్రం మ‌హాశాంతి పూర్ణాహుతి, బాలాల‌య చిత్ర‌ప‌టాల‌కు మ‌హాశాంతిప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు.

ఫిబ్ర‌వ‌రి 26న ఉద‌యం 7.30 గంట‌లకు పుణ్యాహ‌వ‌చ‌నం, ఉద‌యం 10.27 నుండి 10.59 గంట‌ల న‌డుమ ఫాల్గుణ శుద్ధ త‌దియ మేష ల‌గ్నంలో బాలాల‌య చిత్ర‌ప‌టాల‌కు కుంభ ఆవాహ‌న చేప‌డ‌తారు. మ‌ధ్యాహ్నం 11.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ ఈ కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.