BALAYAM AT VALMIKIPURAM TEMPLE FROM OCTOBER 29 TO NOVEMBER 1 _ అక్టోబర్ 29 నుండి నవంబర్ 01వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో బాలాలయం
Tirupati / Valmikipuram, October 27, 2026: Balalayam rituals will be held from October 29 to November 1 at Sri Pattabhirama Swamy and Sri Ranganatha Swamy temples in Valmikipuram, Annamayya district.
The rituals will begin with Ankurarpanam on October 29. Maha Purnahuti will be performed on November 1 from 11 am to 11.30 am.
Balalayam is being conducted to facilitate the renovation of the sanctum sanctorum. Daily rituals will be performed at a model temple arranged inside the temple premises until Maha Samprokshanam.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
అక్టోబర్ 29 నుండి నవంబర్ 01వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో బాలాలయం
తిరుపతి / వాల్మీకిపురం, 2026, అక్టోబర్ 27: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ సీతా, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సమేత శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఆలయాల్లో అక్టోబర్ 29 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు బాలాలయం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా అక్టోబర్ 29వ తేదీ గురువారం సాయంత్రం అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 30న చతుస్స్థానార్చన, కళాకర్షణ, ఏకాంతసేవ నిర్వహిస్తారు. అక్టోబర్ 31న చతుస్స్థానార్చన, ప్రాయశ్చిత్త హోమం, కుంభవాహనం, మహాకుంభాభిషేకం, ద్వారదారు విగ్రహ కళావాహనం, షోడశోపచార పూజ, లఘు పూర్ణాహుతి నిర్వహిస్తారు.
నవంబర్ 1వ తేదీ ఆదివారం సప్తమి తిథి, పునర్వసు నక్షత్రం, ధనుర్లగ్న పుష్కరాంశంలో ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు.
గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరిగే వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.
