BEEJAVAPANAM FOR SKVST BTUs PERFORMED_ శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Srinivasa Mangapuram, 5 February 2018: As the Navahnika Varshika Brahmotsavams in the famous temple of Lord Kalyana Venkateswara Swamy in Srinivasa Mangapuram are scheduled from February 6 to 14, the seed sowing ritual-Ankurarpanam also known as Beejavapanam has been performed on Monday evening.

The ritual commenced as per the Vaikhanasa Agama Vidhi with Mritsangrahanam, Senadhipathi Utsavam before the nine types of seeds are being sowed in nine different mud parts in Yagashala amidst the chant of vedic pundits. This fete was observed between 6pm and 8pm.

The annual fete will commence with Dhwajarohanam in Kumbha Lagnam between 8:15am and 8:45am on February 6. The other important days includes Garuda Seva on February 10, Swarna Ratham on February 11, Rathotsavam on February 13 and Chakrasnanam on February 14.

Temple DyEO Sri Venkataiah is supervising the arrangements for the mega religious festival.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 2018, ఫిబ్రవరి 05: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం వైభవంగా అంకురార్పణ జరిగింది.

అంకురార్పణం సందర్భంగా సోమవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి విశ్వరూప దర్శనం కల్పించారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.

ఫిబ్రవరి 6న ధ్వజారోహణం :

ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం ధ్వజారోహణంతో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 8.15 నుండి 8.45 గంటల మధ్య కుంభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.

ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం రాత్రి

06-02-18(మంగళవారం) ధ్వజారోహణం(కుంభలగ్నం) పెద్దశేష వాహనం

07-02-18(బుధవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

08-02-18(గురువారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం 09-02-18(శుక్రవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

10-02-18(శనివారం) పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

11-02-18(ఆదివారం) హనుమంత వాహనం స్వర్ణరథం,గజ వాహనం

12-02-18(సోమవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

13-02-18(మంగళవారం) రథోత్సవం అశ్వవాహనం

14-02-18(బుధవారం) చక్రస్నానం ధ్వజావరోహణం

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.