BEEJAVAPANAM HELD _ చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirupati, 16 April 2024: The annual Brahmotsavam activities to be held from April 17 to 25 at Chandragiri Sri Kodandaramaswamy Temple was formally commenced with Ankurarpanam or Beejavapanam on Tuesday evening.
As part of this in the morning, Tirumanjanam was performed to the deities. Later from 6pm onwards Senadhipati Utsavam, Mritsangrahanam, Medinipuja and other programs were organized as part of the seed sowing program.
TTD officials participated in this program.
Dhwajarohanam on April 17
The annual Brahmotsavam of Sri Kodanda Ramaswamy temple will be held on April 17 between 9.05 am and 10 am in Vrishabha Lagnam.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2024 ఏప్రిల్ 16: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6 నుండి అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, మేదినిపూజ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 17న ధ్వజారోహణం
శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏప్రిల్ 17న ఉదయం 9.05 నుండి 10 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.