BEEJAVAPANAM PERFORMED IN SRI GT_ శ్రీగోవిందరాజస్వామివారి పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

Tirupati, 29 June 2017: Following annual Pushpayagam on Friday in Sri Govinda Raja Swamy temple, Beejavapanam, the seed sowing ceremony was observed with religious fervour.

Otherwise known as Ankurarpanam, the ritual was performed between 6pm and 9pm. As a part of this fete earlier Senadhipathi utsavam was conducted. Later the priests invited different deities including Brahma, Garuda, Sesha, Sudarsana, Vakratunda, Soma, Santa, Indra and worshipped them in Yagashala chanting the respective mantras.

Temple officials were also present.

Meanwhile the Pushpayagam will take place between 1pm and 4pm on June 30.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీగోవిందరాజస్వామివారి పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

తిరుపతి, 2017 జూన్‌ 29: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్‌ 30వ తేదీన పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం జూన్‌ 29వ తేదీన గురువారం సాయంత్రం 6.00 నుంచి 8.00 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.

మే 31 నుండి జూన్‌ 8వ తేదీ వరకు వరకు శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

జూన్‌ 30వ తేదీ ఉదయం 9.30 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 1.00 నుంచి 4.00 గంటల వరకు పుష్పయాగం, సాయంత్రం 6.00 గంటలకు వీధి ఉత్సవం జరుగనున్నాయి. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి ఈ యాగంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.