BHAGAVAT GITA COMPETITION ON DECEMBER 5 AT AKM _ డిసెంబ‌రు 5న అన్న‌మాచార్య క‌ళామందిరంలో భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు

Tirupati, 25 Nov. 21: With an aim to inculcate the great values of our Sanatana Hindu Dharma among youth, TTD will be conducting a Srimad Bhagavat Gita recitation competition to students on December 5 at Annamacharya Kalamandiram in Tirupati.

This competition will be held under the aegis of the HDPP wing of TTD. The students have to recite the shlokas from the 17th Chapter, Shradhatraya Vibhaga Yogam. The Junior category includes 6th and 7th class students while students of 8th and 9th standards fall under the Senior category.

Similarly, competitions will also be held in all the 700 shlokas from 18 Chapters of Bhagavat Gita and those below 18 years of age are considered to be juniors and above as seniors.

Interested shall participate in the competition which takes place in Annamacharya Kalamandiram from 9am onwards on December 5.

For more details, contact ph. 9676615643, 9866028992, 9133681593.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబ‌రు 5న అన్న‌మాచార్య క‌ళామందిరంలో భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు

తిరుప‌తి, 2021 న‌వంబరు 25: టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వర్యంలో డిసెంబరు 5వ తేదీన తిరుప‌తి అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఉద‌యం 9 గంట‌ల‌కు భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు నిర్వ‌హించ‌నున్నారు. టిటిడి విద్యాసంస్థ‌ల‌తో పాటు తిరుప‌తిలో స్థానికంగా చ‌దువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్న‌వ‌చ్చు.

ఇందులో భాగంగా భ‌గ‌వ‌ద్గీత 17వ అధ్యాయం (శ్ర‌ద్ధాత్ర‌య విభాగ యోగం)లో 6, 7వ త‌ర‌గ‌తి విద్యార్థినీ విద్యార్థులు ఒక విభాగంగాను, 8, 9వ త‌ర‌గ‌తుల విద్యార్థినీ విద్యార్థులు మరొక విభాగంగాను పోటీలు నిర్వ‌హించ‌నున్నారు.

అలాగే, భ‌గ‌వ‌ద్గీత 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలు కంఠ‌స్థం వ‌చ్చిన 18 సంవ‌త్స‌రాల లోపు వారికి జూనియ‌ర్స్‌గాను, అంత‌కుపైబ‌డిన వారికి సీనియ‌ర్స్ విభాగంగాను పోటీలు నిర్వ‌హిస్తారు. ఆస‌క్తిగ‌ల‌వారు డిసెంబ‌రు 5న ఉద‌యం 9 గంట‌ల‌కు అన్న‌మాచార్య క‌ళామందిరంకు రావ‌లసి ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల‌కు 9676615643, 9866028992, 9133681593 నంబ‌రుకు సంప్ర‌దించాల్సి ఉంటుంది.

ఈ పోటీల్లో గెలుపొందిన వారికి గీతాజయంతి సందర్భంగా డిసెంబ‌రు 14వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.