BHAGAVAT GITA COMPETITION _ గీతాజయంతి సందర్భంగా డిసెంబరు 17న శ్రీ మద్భగవద్గీత కంఠస్తం పోటీలు

TIRUPATI, 03 NOVEMBER 2023: In connection with Gita Jayanti on December 23, TTD is organising a competition in Bhagavat Gita to students on December 17.

 

These competitions will be held under the aegis of the Hindu Dharma Prachara Parishad wing of TTD in the 3rd Chapter of Bhagavat Gita – Karma Yogam at Annamacharya Kalamandiram from 9pm onwards.

 

On the same day evening prizes will be distributed. First Prize Rs. 1000, Second Prize Rs. 750 and Third Prize Rs. 500.

 

The competition will be held separately for 6th-7th and 8th-9th standard students.

 

Similarly, competitions will be held separately for candidates below 18 years and above that age who knew all the 700shlokas.

 

From each school, five pupils can participate and they have to register their names in the Annamacharya Kalamandiram or HDPP office in the SVETA building at Tirupati before 5pm on December 13.

 

For more details contact 9676615643.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

గీతాజయంతి సందర్భంగా డిసెంబరు 17న శ్రీ మద్భగవద్గీత కంఠస్తం పోటీలు

తిరుపతి, 2023 నవంబరు 03: టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులతోపాటు తిరుపతి జిల్లాలోని ఇతర పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత 3వ అధ్యాయం “కర్మయోగం” లో కంఠస్తం పోటీలు జరుగనున్నాయి. డిసెంబరు 17న ఉదయం 9 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ పోటీలు నిర్వహిస్తారు.

6, 7 తరగతుల విద్యార్థులకు, 8, 9 తరగతుల విద్యార్థులకు వేరువేరుగా ఈ పోటీలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆయా పాఠశాలల యాజమాన్యం ప్రతిభ గల ఐదుగురు విద్యార్థుల వివరాలను డిసెంబరు 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అన్నమాచార్య కళామందిరంలో లేదా హిందూ ధార్మిక సంస్థల కార్యాలయం(శ్వేత)లో సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు 9676615643 నంబరులో సంప్రదించగలరు.

అదేవిధంగా, భగవద్గీతలోని 700 శ్లోకాలు వచ్చిన వారికి 18 సం.లలోపు వారికి ఒక విభాగంగాను, 18 సం.రాలు పైబడినవారికి మరో విభాగంగాను పోటీలు నిర్వహిస్తారు.

ఈ పోటీలలో విజేతలైన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.1000/-, రూ.750/-, రూ.500/- నగదుతోపాటు ప్రశంసాపత్రం అందిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.