BHAGAVATHA SADAS IN AKM ON JUNE 28 AND 29_ జూన్‌ 28, 29వ తేదీల్లో అన్నమాచార్య కళామందిరంలో భాగవత సదస్సు

Tirupati, 26 June 2017: The two day Bhagavata Sadas in Annamacharya Kalamandiram in Tirupati will take place on June 28 and 29.

TTD has published the books penned by Sri Bammera Pothana in Sarala Telugu Vyakhyanam and released it during Vontimitta annual fete on April 10 earlier this year.

About 33 pundits worked day and night to bring the best volumes in Telugu. TTD will felicitate these experts on this occasion.

TTD Publications Special Officer Sri T Anjaneyulu is supervising the arrangements.

Meanwhile TTD has placed these volumes on its website also. So far 1500 literature lovers have downloaded this great work.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 28, 29వ తేదీల్లో అన్నమాచార్య కళామందిరంలో భాగవత సదస్సు

తిరుపతి, 2017, జూన్‌ 26: టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో జూన్‌ 28, 29వ తేదీల్లో రెండు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భాగవత సదస్సు జరుగనుంది. శ్రీ బమ్మెర పోతనామాత్యుడు రచించిన తెలుగు భాగవతాన్ని టిటిడి సరళ వ్యాఖ్యానంతో ముద్రించింది. ఈ గ్రంథాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరాముని కల్యాణం సందర్భంగా గౌ|| రాష్ట్ర గవర్నర్‌ శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌ ఆవిష్కరించిన విషయం విదితమే.

ఈ పోతన భాగవతానికి వ్యాఖ్యానాన్ని 33 మంది పండితులు రాశారు. పండితులైన సంపాదక మండలి సభ్యులు దాన్ని పరిష్కరించారు. భాగవత వ్యాఖ్యానం రచనలోనూ, పరిష్కరణలోనూ సహకరించిన పండితులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. భాగవతం విశిష్టతపై ప్రముఖ పండితులు ఉపన్యసిస్తారు.

భాగవత సదస్సు బుధవారం ఉదయం 10.15 గంటలకు ప్రారంభమవుతుంది. రెండు రోజుల పాటు మూడు సాహితీ సమావేశాలు నిర్వహిస్తారు. చివరి రోజు ముగింపు సమావేశం, పండిత సత్కార కార్యక్రమాలు ఉంటాయి. టిటిడి ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా||తాళ్లూరి ఆంజనేయులు ఈ సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

చక్కటి పాఠకాదరణ :

సరళ వ్యాఖ్యాన సహితంగా ముద్రించిన ఈ పోతన భాగవతం గ్రంథానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చక్కటి ఆదరణ లభిస్తోంది. టిటిడి వెబ్‌సైట్‌లోని ఈ-పబ్లికేషన్స్‌లో ఈ గ్రంథాన్ని ఏప్రిల్‌ 10న అప్‌లోడ్‌ చేశారు. 60 రోజుల కాలంలో దాదాపు 1500 మందికి పైగా పాఠకులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.