BHAJANS RESOUND AT MADA STREETS_ మాడ వీధుల్లో భజన మండపాలు భజనలతో మార్మోగుతున్న గ్యాలరీలు అన్నమయ్య, పురందరదాస, తరిగొండ వెంగమాంబ, పెద్దతిరుమలయ్య, త్యాగయ్య పేర్లతో వేదికలు
Tirumala, 13 October 2018: The TTD has rolled out a feast of bhajans on the sacred Mada Streets of Tirumala as part of Srivari Navaratri Brahmotsavam.
Bhajans keep the devotees sitting at all the galleries enthralled at the five colorfully decorated Mandapams named after Annamaiah, Purandaradasa, Tarigonda Vengamamba, Pedda Tirumalaiah, and Thagayya. The HDPP, Annamayya project artists enthrall the devotees sitting in galleries both in morning and evening.
The Sri Vengamamba bhajan mandala from Visakhapatnam led by Smt S Satyadevi rendered service today at the south Mada Street Mandapam.
Similarly at the Purandaradasa Mandapam near Sri Varaha Swamy temple, the 16 artists from munjala yuva bhajan mandali led by Smt Ratna from Bangalore presented Purandaradasa sankeertans.
In the same manner at the Sri Tarigonda Vengamamba Mandapam the 18 artists from the Startasena bhajan mandala of Udupi in Karnataka presented Keertans of Sri Purandara dasa.
At the Sri Thyagaraja Mandapam the HDPP organised Bhakti sangeet by artists of sri Shanmukga Rao team from Srikakulam. The KT GovindaRao team from Vizianagaram presented sankeertans at the PeddaThirumalayya mandpam.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
మాడ వీధుల్లో భజన మండపాలు భజనలతో మార్మోగుతున్న గ్యాలరీలు అన్నమయ్య, పురందరదాస, తరిగొండ వెంగమాంబ, పెద్దతిరుమలయ్య, త్యాగయ్య పేర్లతో వేదికలు
అక్టోబరు 13, తిరుమల 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలను తిలకించేందుకు విచ్చేసే భక్తుల కోసం ఆలయ మాడ వీధుల్లో టిటిడి భజన మండపాలు ఏర్పాటుచేసింది. ఉదయం, రాత్రి వాహనసేవల సమయంలో ఇక్కడ కళాకారుల భజనలతో గ్యాలరీలు మారుమోగుతున్నాయి. భక్తులు గోవిందనామస్మరణతో వాహనసేవల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలతో కీర్తనలు రచించి భక్తలోకానికి అందించిన ప్రముఖ వాగ్గేయకారులైన శ్రీఅన్నమయ్య, శ్రీ పురందరదాస, శ్రీ తరిగొండ వెంగమాంబ, శ్రీ పెద్దతిరుమలయ్య, శ్రీ త్యాగయ్య పేర్లతో వేదికలు ఏర్పాటుచేశారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో శుక్రవారం ఈ వేదికలపై భజనలు చేసిన కళాబృందాల వివరాలిలా ఉన్నాయి.
అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో దక్షిణ మాడ వీధిలో శ్రీ అన్నమయ్య మండపం ఏర్పాటుచేశారు. ఇక్కడ విశాఖకు చెందిన శ్రీమతి ఎన్.సత్యదేవి నేతృత్వంలోని శ్రీ వెంగమాంబ భక్త మండలికి చెందిన 15 మంది కళాకారులు భజనలు చేశారు. వీరు అన్నమయ్య సంకీర్తనలను భజన సంప్రదాయంలో రమ్యంగా ఆలపించారు. అదేవిధంగా, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవరాహస్వామివారి ఆలయం వద్ద గల శ్రీ పురందరదాస మండపం, అర్చక భవనం సమీపంలో శ్రీ తరిగొండ వెంగమాంబ మండపం ఏర్పాటుచేశారు. శ్రీ పురందరదాస మండపంలో బెంగళూరుకు చెందిన శ్రీమతి రత్న నేతృత్వంలోని మంజుల యువ భజనమండలి 16 మంది కళాకారులు పురందరదాస కీర్తనలు, హరిదాస సంకీర్తనలతో భజనలు చేశారు. శ్రీ తరిగొండ వెంగమాంబ మండపంలో ఉడిపిలోని సత్యాత్మసేన భజన మండలికి చెందిన 18 మంది కళాకారుల పురందరదాస కీర్తనలను ఆలపించారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మేదరమిట్ట వద్ద శ్రీ త్యాగయ్య మండపం, పడమర మాడ వీధిలో శ్రీ పెద్ద తిరుమలయ్య మండపం ఉన్నాయి. శ్రీ త్యాగయ్య మండపంలో శ్రీకాకుళానికి చెందిన శ్రీ కె.షణ్ముఖరావు బృందం పలుదేవతలకు సంబంధించి జానపద భజన పాటలను చక్కగా పాడారు. శ్రీ పెద్ద తిరుమలయ్య మండపంలో విజయనగరానికి చెందిన శ్రీ టి.గోవిందరావు భజన బృందం సభ్యులు గ్రామీణ భక్తి పాటలను వినసొంపుగా ఆలపించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.