BHAJANA IS THE EASY WAY TO GET SALVATION-PEJAWAR MUTT SEER_ భగవన్నామస్మరణ ముక్తికి మార్గం : పెజావ‌ర్ మ‌ఠం శ్రీ‌శ్రీ‌శ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న‌తీర్థ‌స్వామీజీ

Tirupati, 4 Jul. 19: The pontiff of Pejawar Mutt, Karnataka, HH Sri Vishwa Prasanna Theertha Swamiji advocated that in Kaliyuga, the easy way to attain salvation is through the way of Bhajana and Nama Sankeertana.

Delivering his religious diacourse on the occasion of Traimasika Metlotsavam on Thursday evening at III Choultry in Tirupati the seer said, Saint Purandhara Dasa keertans are aimed attaining Moksha Gnanam with simple words which could reach even a very common individual.

Earlier the Dasa Sahitya Project Special Officer Dr PR Anandatheerthacharyulu briefed on the importance of the three day programme which they have been observing since last one decade.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

భగవన్నామస్మరణ ముక్తికి మార్గం : పెజావ‌ర్ మ‌ఠం శ్రీ‌శ్రీ‌శ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న‌తీర్థ‌స్వామీజీ

తిరుప‌తి, 2019 జూలై 04: మాన‌వుల‌కు భగవన్నామస్మరణ ఒక్క‌టే ముక్తికి మార్గమని ఉడిపికి చెందిన పెజావ‌ర‌ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న‌తీర్థ‌స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో తిరుప‌తిలోని రైల్వేస్టేష‌న్ వెనుక‌గ‌ల మూడో స‌త్రం ప్రాంగ‌ణంలో గురువారం త్రైమాసిక మెట్లోత్స‌వ కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ సందర్భంగా సాయంత్రం స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ భగవంతుని చేరాలంటే ముందు ఆయన పరమభక్తుల అనుగ్రహం అవసరమని పురాణాలు పేర్కొంటున్నాయని, ఈ కోవకు చెందిన పరమభక్తుడు శ్రీ పురందరదాసు అన్నారు. నేడు వేలాది మంది భక్తులు పురందరదాసు రచించిన లక్షలాది కీర్తనలు ఆలపిస్తూ స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని, ఇదే కలియుగంలో నామసంకీర్తనకున్న వైశిష్ట్యమన్నారు. దాససాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న భజన మండళ్ల సభ్యులను అభినందించారు.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు విశేషాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లడుతూ ఒక జీవితకాలంలో 4.75 లక్షల సంకీర్తనలు రచించడం దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీ పురందరదాసుకే సాధ్యమైందని తెలిపారు. పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు. అనంత‌రం స్వామీజీని శాలువ‌, శ్రీ‌వారి ప్ర‌సాదంతో స‌న్మానించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేర‌ళ రాష్ట్రాల నుండి 2500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.