BHAKTI SANGEET ON NADA NEERAJANAM PLATFORM A VISUAL TREAT _ నాదనీరాజనం వేదికపై ఆక‌ట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

Tirumala, 3 Oct. 19: The programmes arranged on the cultural platform, Nada Neerajanam in Tirumala has provided a visual treat to the devotees on Thursday.

Vishnu Sahasranama Parayanam, Dharmikopanyasam, Chaturveda Parayanam and Mangaladhwani charmed the pilgrims. While the Annamaiah Sankeertans rendered by Dr Sobharaj and her team from Hyderabad and Namasankeertana by VK Ravichandran from Tamilnadu, Sri G Madhusudhana Rao concert during Unjal Seva, Harikatha by Sri M Rambabu from Machilipatnam, added religious fervour.

Dr Dwaram Lakshmi vocal concert at Asthana Mandapam also enthralled the music lovers in Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

నాదనీరాజనం వేదికపై ఆక‌ట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు


అక్టోబరు 03, తిరుమ‌ల‌, 2019:  శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

  ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం 5 నుండి 5.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి కె.ఈశ్వ‌ర‌మ్మ బృందం మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ శేషావ‌తారం బృందం విష్ణుసహస్రనామ పారాయ‌ణం, ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు చోడ‌వ‌రానికి చెందిన శ్రీ ఎస్‌.సీతారామాచారి ధార్మికోపన్యాసం చేశారు.

  మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు హైద‌రాబాద్‌కు చెందిన డా. శోభారాజు బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు త‌మిళ‌నాడులోని విల్లిపురానికి చెందిన శ్రీ వికె.ర‌విచంద్ర‌న్ బృందం నామసంకీర్తన, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో తిరుప‌తికి చెందిన శ్రీ జి.మ‌ధుసూద‌న‌రావు బృందం అన్నమాచార్య సంకీర్తనలను వీనుల‌విందుగా గానం చేశారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు మ‌చిలీప‌ట్నంకు చెందిన శ్రీ ఎం.రాంబాబు భాగ‌వ‌తార్ బృందం హరికథ పారాయణం చేశారు.

  అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో గురువారం ఉదయం 11.30 నుండి 12.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి ద్వారం ల‌క్ష్మీ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.