BHASHYAKARULA UTSAVAM COMMENCES _ తిరుమలలో భాష్యకారుల ఉత్సవం  ప్రారంభం

TIRUMALA, 16 APRIL 2023: The Bhashyakarla utsavam commenced in Tirumala on Sunday and the processional deity of Saint Ramanujacharya dressed in Golden Kavacham was taken on a procession on Tiruchi along four Mada streets.

 

Divyaprabandha Gosthi was rendered by Jeeyangar Swamijis and their disciples on this occasion.

 

As Sri Ramanujacharya has penned Sri Bhashyam, he was also known as Bhashyakarla varu.

Sri Bhashyam is considered as one of the most important texts of the Sri Vaishnava tradition.

 

Tirumala pontiffs Sri Pedda Jeeyangar and Sri Chinna Jeeyangar Swamijis also took part in this religious fete.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో భాష్యకారుల ఉత్సవం  ప్రారంభం

తిరుమల, 16 ఏప్రిల్ 2023: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగనుంది. ఏప్రిల్ 25న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయ్యంగార్లు దివ్యప్రబంధ గోష్టి చేపట్టారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్‌స్వామి, పార్‌ప‌త్తేదార్ శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.