BHISHMA EKADASI ON FEBRUARY 12 _ ఫిబ్రవరి 12న తిరుమ‌ల‌లో విష్ణు సహస్రనామ అఖండ పారాయణం

TIRUMALA, 11 FEBRUARY 2022: On the auspicious occasion of Bhishma Ekadasi, Akhanda Vishnu Sahasranama Parayanam will be rendered in Nadaneerajanam at Tirumala on February 12 between 6am and 9am.

This program will be telecasted live on SVBC for the sake of global devotees. Vishnu Sahasranamam will be recited thrice under the supervision of Vedic Scholars Sri Seshacharyulu, Sri Narasimham and Sri Brahmachary.

Vedic Scholars and Pundits takes part in this event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఫిబ్రవరి 12న తిరుమ‌ల‌లో విష్ణు సహస్రనామ అఖండ పారాయణం

తిరుమ‌ల‌, 2022 ఫిబ్ర‌వ‌రి 11: భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య తిరుమలలో నాదనీరాజనం వేదిక‌పై విష్ణు సహస్రనామ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.

వేదపండితులు శ్రీ శేషాచార్యులు, శ్రీ నరసింహం, శ్రీ బ్రహ్మచారి పర్యవేక్షణలో మూడుసార్లు విష్ణు సహస్రనామం పారాయణం జరుగుతుంది. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల పండితులు, అధ్యాపకలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.