BHOGI TERU IN SRI GT ON JAN 14_ జనవరి 14న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో భోగి తేరు

Tirupati, 12 Jan 19:In connection with auspicious Bhogi festival, Bhogi Teru will be observed in Sri Govinda Raja Swamy temple on January 14 in Tirupati.

As a part of this festival Sri Krishna Swamy and Sri Andal Godai will be seated on a small chariot and taken out for procession in four mada streets in the evening between 5.30pm and 7pm.

Later on January 15 following Makara Sankranthi festival, the Sudarshana Chakrattalwar will be taken to Alwar tank in Kapilatheertham and chakra snanam will be observed.

On January 16, Andal Sri Goda Parinayam and on January 17 Paruveta Utsavam will be observed

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జనవరి 14న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో భోగి తేరు

తిరుపతి, 2019 జనవరి 12: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 14న సోమవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించనున్నారు.

సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.00 గంటల వరకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగి తేరుపై కొలువుదీర్చి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

జనవరి 15న మకర సంక్రాంతి :

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి కావడంతో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 5.30 గంటలకు సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. ఉదయం 7.00 గంటలకు శ్రీ చక్రత్తాళ్వార్‌ను కపిలతీర్థం వద్దగల ఆళ్వార్‌ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుంచి 7.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి ఆస్థానం చేపడతారు.

కాగా, జనవరి 16న గోదా పరిణయోత్సవం, జనవరి 17న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.