BHOGI THERU ON JANUARY 14 _ శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 14న భోగితేరు, 15న మకరసంక్రాంతి

GODAKALYANAM ON 16th JANUARY

Tirupati, 06 January 2024: In connection with the Sankranti festivities, Bhogi Teru and Makarasankranti festivals will be held on January 14 and January 15 respectively at Sri Govindaraja Swamy temple in Tirupati.

On January 14, on the Bhogi festival, from 5.30 pm to 7 pm, a procession of Sri Andal Ammavaru and Sri Krishna Swamy will be carried out.

Sankranti Tirumanjanam is performed in the morning on the occasion of Makar Sankranti on January 15.  At 6.30 a.m. from the temple, the Chakratalwar is taken out in procession to Sri Alwar Theertha in Kapilatheertham.  Between 5.30 pm and 7 pm Sridevi and Bhudevi together with Sri Govindaraja Swamy will parade along Mada streets.

On the morning of January 16, Melchat Vastram and flower garlands are taken in a procession from Sri Pundarikavalli Ammavaru Temple and offered to Sri Andal Amma.  Sri Andal Ammavaru is worshiped at Sri Alwar Theertha in Kapila Theertham. After Tirumanjanam  there, they will return to the temple in solitude. 

Sri Godakalyanam ceremony will be conducted in the temple between 4 pm and 6.30 pm.

Similarly, Parveta festival will be held on January 17.  On this occasion Sridevi and Bhudevi along with Sri Govindaraja Swamy will be taken on a procession from the temple to Parveta Mandapam located on Renigunta road between 4 pm and 6 pm. and later return to the temple.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 14న భోగితేరు, 15న మకరసంక్రాంతి

•⁠ ⁠జనవరి 16న గోదాక‌ల్యాణం

తిరుప‌తి, 2024 జనవరి 06: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జనవరి 14న భోగితేరు, జ‌న‌వ‌రి 15న మకరసంక్రాంతి ప‌ర్వ‌దినాలు జరుగనున్నాయి.

జనవరి 14న భోగి పండుగ రోజున సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు.

జనవరి 15న మకర సంక్రాంతి సంద‌‌ర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఆల‌యం నుండి చ‌క్ర‌త్తాళ్వార్‌ను ఊరేగింపుగా క‌పిల‌తీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ చ‌క్ర‌స్నానం అనంత‌రం ఆస్థానం చేప‌డ‌తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజస్వామివారు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

జనవరి 16న ఉద‌యం శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రం, పూల‌మాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మ‌వారికి స‌మ‌ర్పిస్తారు. శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని క‌పిల‌తీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ ఏకాంతంగా తిరుమంజ‌నం అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు. ఆల‌యంలో సాయంత్రం 4 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ గోదాక‌ల్యాణం వేడుకగా నిర్వ‌హిస్తారు.

అదేవిధంగా, జ‌న‌వ‌రి 17న పార్వేట ఉత్స‌వం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యం నుండి రేణిగుంట రోడ్డులోని పార్వేట‌మండ‌పానికి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని వేంచేపు చేస్తారు. అక్క‌డ ఆస్థానం అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.