BHRIGU AND SRINIVASA MAKHI TIRU NAKSHATROTSAVAM HELD _ భృగు, శ్రీనివాస మఖి తిరునక్షత్రోత్సవం
TIRUMALA, 03 MAY 2022: The Tiru Nakshatrotsavams of Vaikhanasa saints Sri BHRIGU Maharshi and SrinSriniavasa Makhi was held in Tirumala on Tuesday evening.
The event took place in Vaikhanasa Ashramam in Tirumala under the aegis of Alwar Divya Prabandha Project of TTD and Vaikhanasa Divya Siddhanta Vardhini Sabha.
All Projects Officer Sri L Vijaya Saradhi, Sanskrit Scholar Sri C Ranganathan, Agama Advisor Dr V Vishnu Bhattacharyulu, Vaikhanasa Trust organiser Sri Prabhakaracharylu and others participated and recalled the impeccable services rendered by the two great saints.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
భృగు, శ్రీనివాస మఖి తిరునక్షత్రోత్సవం
మే 3, తిరుమల 2022: వైఖానస అచార్యులు శ్రీ భృగు మహర్షి, శ్రీ శ్రీనివాస మఖి తిరునక్షత్రోత్సవాలు మంగళవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా జరిగాయి.
తిరుమలలోని వైఖానస ఆశ్రమంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, వైఖానస దివ్య సిద్ధాంత వర్ధినీ సభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ ఎల్. విజయ సారధి, సంస్కృత పండితులు శ్రీ సి.రంగనాథన్, ఆగమ సలహాదారు డాక్టర్ వి. విష్ణుభట్టాచార్యులు, వైఖానస ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ ప్రభాకరాచార్యులు పాల్గొని ఆ ఇద్దరు మహానుభావులు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.