BHUKARSHANA PUJA ON JAN 31 IN AMARAVATHI-TTD EO_ జనవరి 31న అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Vijayawada, 18 Jan. 19: The Bhukarshana Puja for the Sri Venkateswara Divya kshetram in Amaravathi is scheduled on January 31, said TTD EO Sri Anil Kumar Singhal.

Speaking to media persons at the Divya Kshetram premises on Friday the EO said, the CRDA has given 25 acres to TTD out of which five acres will be dedicated to construct the temple while in the remaining 20 acres master plan is getting ready to construct kalyana mandapam, auditorium etc. The muhurat for Bhukarshana Puja on January 31 is fixed between 9.15am and 9.45am. The Honourable CM Sri N Chandrababu Naidu also given his consent to take part in this ritual.

We all reviewed about the elaborate arrangements to be made stalls, annaprasadam etc. for this fete. We are also inviting Srivari Sevakulu to take part in this religious program.

The other temples also which were constructed at Kurukshetra is also attracting devotees in huge numbers. On January 27, Mahakumbhabhishekam of Sri Venkateswara Divya Kshetram at Kanya kumari will take place which marks the ceremonial opening of the temple. Similarly Divya Kshetrams are coming up at Bhubaneswar, Vizag and also in agency areas including Rampachodavaram, Seetampeta, Parvathipuram we are soon to construct temples at Ra.3 to 4crores, he added.

Answering the media, EO cleared that the temple which is coming up at Amaravathi at Rs.150crores is not a replica of Tirumala temple. But all the kainkaryams will be on par with Tirumala shrine. He said, starting from Suprabhatam to Ekantaseva all the rituals are replicated in this temple also, he maintained. “To provide aesthetic feel to the temple we are going for stone masonry instead of brick construction”, EO explained.

The EO invited all the devotees, volunteers, Dharma Pracharam artistes to take part in the Bhukarshana fete. After this ceremony other rituals will last till February 10. So all the arrangements are going on to accommodate ritwiks, distribute anna prasadam, arrange book stalls, display the model temple etc., EO said.

Earlier EO along with Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jetti, Chief Engineer Sri Chandrasekhar Reddy, Agama Advisor Sri Mohana Rangacharyulu, DyEO Sri Rajenderudu, Annaprasadam Spl Officer Sri Venugopal and other senior officers inspected the ongoing works.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జనవరి 31న అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

జనవరి 18, అమరావతి 2019: రాష్ట్ర రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి జనవరి 31వ తేదీన భూకర్షణం, బీజావాపనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలంలో భూకర్షణ కోసం జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీగోపినాథ్‌జెట్టితో కలిసి ఈవో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ జనవరి 31న ఉదయం 9.15 నుండి 9.40 గంటల మధ్య భూకర్షణ కార్యక్రమం జరుగనుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు రానున్నారని తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం ఆగమశాస్త్రం ప్రకారం భూకర్షణ చేయడం ఆనవాయితీ అని, ఆగమ సలహాదారుల సూచన మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. సిఆర్‌డిఏ 25 ఎకరాలు టిటిడికి కేటాయించిందని, ఇందులో 5 ఎకరాల్లో శ్రీవారి ఆలయం, మిగిలిన 20 ఎకరాల్లో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించి ఆధ్యాత్మిక కార్యకలాపాల నిర్వహణ కోసం ఆడిటోరియాలు, కల్యాణమండపాలు తదితర నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. దాదాపు రూ.140 కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు టిటిడి ధర్మకర్తల మండలి టెండర్లు ఖరారు చేసినట్టు వెల్లడించారు.

శ్రీవారి భక్తుల కోరిక మేరకు గత ఏడాది జులైలో కురుక్షేత్రలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామని, ఇక్కడ రోజువారీగా వెయ్యి నుండి 2 వేల మంది, ఉత్సవాల రోజుల్లో 10 వేల నుండి 15 వేల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారని ఈవో తెలిపారు. జనవరి 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ విగ్రహప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని, మార్చి 13న హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురంలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేశామన్నారు. విశాఖపట్నం, భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాలతోపాటు చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ధర్మప్రచారంలో భాగంగా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించి తిరుమల తరహాలో సంప్రదాయబద్ధంగా కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు.

భూకర్షణం కోసం హోమగుండాలు, వేదిక, సిఆర్‌డిఏ స్టాళ్లు, ఆలయ నమూనా ఎగ్జిబిషన్‌, ప్రత్యక్ష ప్రసారాలు, డిస్‌ప్లే స్క్రీన్లు తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించామని ఈవో తెలిపారు. భూకర్షణంలో భాగంగా శ్రీవారి కల్యాణోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తామన్నారు. భూకర్షణం తరువాత 10 రోజుల పాటు అర్చకులు ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు చేపడతారని వివరించారు. ఆ తరువాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు.

శ్రీవారి సేవకులకు ఆహ్వానం …

గౌ|| ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ కార్యక్రమానికి శ్రీవారి సేవకులను, భజన మండళ్ల సభ్యులను ఆహ్వానిస్తున్నామని ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. శ్రీవారి సేవకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ఎస్వీబీసీ సిఈవో శ్రీ వెంకట నగేష్‌, ఈఈ శ్రీప్రసాద్‌, డెప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్రుడు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీవేణుగోపాల్‌, ఏఈవో శ్రీ గోవిందరాజులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.