BOOKS RELEASED _ క‌ల్ప‌వృక్ష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

TIRUMALA, 30 September 2022: Four books were released by TTD Chairman Sri YV Subba Reddy and EO Sri AV Dharma Reddy on Friday in front of Kalpavriksha Vahanam.

Vasadhikaraha, Yagnadhikaraha, Khiladhikaram, of Vaikhanasa Agama, Tirumala Kshetragadha penned by Sri Julakanti Balasubramanyam were released.

TTD Board members Sri Ashok Kumar, New Delhi LAC Chief Smt Prasanti Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, special officer of Publications Sri Ramakrishna Sastry, sub editor Sri Narasimhacharya were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

క‌ల్ప‌వృక్ష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 30: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్ర‌వారం ఉదయం క‌ల్ప‌వృక్ష‌ వాహనసేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టిటిడి చైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆవిష్కరించారు.

వీటిలో శ్రీ వైఖాన‌సాగ‌మ శాస్త్రాల్లో అత్యంత ప్రామాణిక‌మైన ‘వాసాధికారః’, ‘య‌జ్ఞాధికారః’, ‘ఖిలాధికారః’ అనే గ్రంథాలున్నాయి. వైఖాన‌స ఆగ‌మ‌శాస్త్ర సంర‌క్ష‌ణ‌లో భాగంగా ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు వీటిని ప‌రిష్క‌రించి ముద్రించారు. మ‌రో గ్రంథం స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక విశ్రాంత సంపాద‌కులు శ్రీ జూల‌కంటి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ర‌చించిన తిరుమ‌ల క్షేత్ర‌గాథ‌. ఇందులో శ్రీ‌వారి ద‌ర్శ‌న విధానం, చూడ‌వ‌ల‌సిన అద్భుత ప్ర‌దేశాలు, ద‌ర్శించ‌వ‌ల‌సిన పుణ్య‌తీర్థాలు, ప్ర‌త్యేక స్థ‌లాల గురించిన వివ‌రాలు ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ పోక‌ల అశోక్‌కుమార్‌, ఢిల్లీ స్థానిక స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ రామ‌కృష్ణ‌శాస్త్రి, ఉప సంపాదకులు డా|| నరసింహాచార్య పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.