BRAHMOTSAVA VAHANA SEVAS CULMINATES WITH ASWA VAHANA _ అశ్వ వాహ‌నంపై క‌ల్కి అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

Tirupati, 26 Jun. 21: The Brahmotsava vahana sevas at Appalayagunta concluded with Aswa Vahanam on Saturday evening.

Due to Covid norms, the vahana Seva held in Ekantam.

In the Kalki incarnation, Sri Prasanna Venkateswara blessed devotees on a penultimate day.

Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, Superintendent Sri Gopala Krishna Reddy were also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అశ్వ వాహ‌నంపై క‌ల్కి అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి, 2021 జూన్ 26: అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు శ‌ని‌వారం సాయంత్రం స్వామివారు క‌ల్కి అలంకారంలో అశ్వ వాహ‌నంపై దర్శనమిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో వాహ‌న‌సేవ‌లు ఆలయంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనం పై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, తన నామ సంకీర్తనలతో తరించాలని ప్రబోధిస్తున్నారు.

కాగా, బ్ర‌హ్మోత్స‌వాల్లో చివ‌రి రోజైన ఆదివారం ఉద‌యం 8.30 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.