BRAHMOTSAVAMS OF KADAPA TEMPLE FROM JAN 26- FEB 3 _ జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 29 Dec. 19: All arrangements for the annual Brahmotsavams of Sri Lakshmi Venkateswara Swamy temple at YSR Kadapa district are in place which will be observed from January 26 to February 3 with Ankurarpanam on January 25.

Following are the details of events   

26-01-2020: Dwajarohanam    Chandraprabha vahanam 

27-01-2020: Surya Prabha vahanam,     Pedda Sesha Vahanam 

28-01-2020: Chinna Sesha Vahanam ,  Simha Vahanam 

29-01-2020:  Kalpavruksha Vahanam,  Hanumantha Vahanam       

30-01-2020: Mutyapu pandiri,  Garuda Vahanam 

31-01-2020: Kalyanotsavam   Gaja vahanam        

01-02-2020: Rathotsavam,  Dhooli utsavam 

02-02-2020: Sarva Bhoopala, Aswa  

03-02-2020: Vasantotsavam, ChakranaSnanam,  Hamsa vahanam, Dwajaavarohanam  

04-02-2020: Pushpayagam

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2019 డిసెంబ‌రు 29: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న వై.య‌స్‌.ఆర్‌.కడప జిల్లాలోని దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 25వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                 ఉదయం              రాత్రి

26-01-2020(ఆదివారం)     ధ్వజారోహణం           చంద్రప్రభ వాహనం

27-01-2020(సోమవారం)      సూర్యప్రభవాహనం      పెద్దశేష వాహనం

28-01-2020(మంగళవారం)   చిన్నశేష వాహనం     సింహ వాహనం

29-01-2020(బుధవారం)        కల్పవృక్ష వాహనం       హనుమంత వాహనం

30-01-2020(గురువారం)   ముత్యపుపందిరి వాహనం గరుడ వాహనం

31-01-2020(శుక్రవారం)          కల్యాణోత్సవం          గజవాహనం        

01-02-2020(శనివారం)            రథోత్సవం       ధూళి ఉత్సవం

02-02-2020(ఆదివారం)       సర్వభూపాల వాహనం     అశ్వ వాహనం

03-02-2020(సోమ‌వారం)     వసంతోత్సవం, చక్రస్నానం     హంసవాహనం, ధ్వజావరోహణం

కాగా జ‌న‌వ‌రి 31వ తేదీ శుక్ర‌వారం ఆలయంలో కల్యాణోత్సవం ఉదయం 9.30 నుండి 1130 గంటల వరకు వైభవంగా జరుగనుంది. రూ.300- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 4వ తేదీ మంగ‌ళ‌వారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు ఘనంగా జరుగనుంది.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.