BREAK DARSHAN IN TIRUCHANOOR FROM AUGUST 1_ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 1 నుండి బ్రేక్ దర్శనం అమలు
Tirupati, 30 July 2018: To avoid inconvenience to common pilgrims, TTD has introduced VIP break darshan in the temple of Padmavathi Devi in Tiruchanoor which will come into force from August 1 onwards.
According to this new system, the break darshan will be provided twice a day between 11.30am and 12 noon, again between 7.30pm and 8pm. The protocol VIPs who wish to have darshan of Goddess should give their names as per prescribed proforma by 8am for morning break and at 3pm for evening break in the office of AEO temple located at PAC in Tiruchanoor. The price of each ticket has been fixed as Rs.250.
The temple will remain open from 4.30am to 9.30pm from August 1 onwards. There will be no change in the darshan of common pilgrims. Those who accompany protocol VIPs during Kumkarchana, shall purchase Rs.100 ticket and can have Laghu Darshan.
The devotees are requested to make note of these changes and co-operate with TTD.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 1 నుండి బ్రేక్ దర్శనం అమలు
తిరుపతి, 2018 జూలై 30: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 1వ తేదీ నుండి ఉదయం 11.30 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 7.30 గంటల వరకు బ్రేక్ దర్శనాన్ని టిటిడి అమలుచేయనుంది. ప్రోటోకాల్ విఐపిలకు నిర్దేశించిన సమయంలో అమ్మవారి దర్శనం కల్పించేందుకు, సాధారణ భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు బ్రేక్ దర్శనాన్ని టిటిడి ప్రవేశపెట్టింది.
ఉదయం బ్రేక్ దర్శనానికి రావాలనుకునే ప్రోటోకాల్ విఐపి భక్తులు ఉదయం 8 గంటలకు, సాయంత్రం బ్రేక్ దర్శనానికి రావాలనుకునే భక్తులు మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ ఏఈవో కార్యాలయంలో (పీఏసీ సమీపంలో) సూచించిన నమూనా పత్రంతోపాటు ఆధార్ కార్డును జతచేసి అందజేయాల్సి ఉంటుంది. బ్రేక్ దర్శనం టికెట్ ధర రూ.250/-గా నిర్ణయించారు. వీరికి హారతి, తీర్థం, శఠారి ఉంటుంది. కుంకుమార్చన మధ్యాహ్నం 1 గంట నుండి 4.30 గంటల వరకు యథావిధిగా కొనసాగుతుంది.
ఇకపై ఆలయాన్ని ఆరగంట ముందుగా ఉదయం 4.30 గంటలకు తెరుస్తారు. రాత్రి 9 గంటలకు బదులు 9.30 గంటలకు మూస్తారు. సాధారణ భక్తులకు దర్శన సమయంలో ఎలాంటి తగ్గింపు లేకుండా ఒక గంట పాటు బ్రేక్ దర్శనాన్ని అమలు చేసేందుకు ఈ మేరకు ఆలయ వేళల్లో మార్పులు చేశారు.
బ్రేక్ దర్శనం, కుంకుమార్చన సేవ తరువాత ప్రోటోకాల్ విఐపిలు రూ.100/- టికెట్ కొనుగోలు చేసి అమ్మవారిని లఘు దర్శనం చేసుకోవచ్చు. సాధారణ భక్తుల సౌకర్యార్థం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రోటోకాల్ విఐపిలు సహకరించాలని టిటిడి కోరుతోంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.