BTU OF UPAMAKA SRI SVS FROM OCT 10 TO 18_ అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 6 October 2018: The annual Brahmotsavam of Sri Venkateswara Swamy Temple at Umapaka village of Nakkavalli Mandalam, Visakhapatnam will commence from October 10-18.

The Brahmotsava Kavidi will be performed traditionally on October 9 in the morning hours. Lord will bless devotees at night by riding on Chinna Pallaki, Utsavam and also Aswa Vahanam.

DETAILS OF THE BRAHMOTSAVAM EVENTS;

10-9-2018 Pedda Pallaki Rajadhiraja Vahanam
11-9-2018 Hanumantha Vahanam Ittadi Sapparam
12-09-2018 Pedda Pallaki Hamsa Vahanam
13-09-2018 Rajadhiraja Pedda Pallaki
14-09-2018 Hamsa Vahanam Ittadi Sapparam
15-09-2018 Vasantotsavam- Garuda vahanam
16-09-2018 Rathotsavam- Punyakoti
17-09-2018 Mrugasveta – Gaja vahanam
18-09-2018 Vinodotsavam- Pallaki Utsavam

From October 10-18 Sri Perumal will parade on Chinna Pallaki and the HDPP wing of TTD is organizing Harikatha, Parayanam, Annamacharya Project will conduct bhakti sangeet and other devotional programs.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, AND TIRUPATI.

అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2018 అక్టోబరు 06: విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం, ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అక్టోబరు 9వ తేదీన ఉదయం 10.30 గంటలకు తిరువీధిలో ”బ్రహ్మోత్సవ కావిడి” త్రిప్పుటతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. రాత్రి చిన్న పల్లకీ ఉత్సవం, అశ్వవాహనంపై స్వామివారు విహరించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

10-10-2018 పెద్ద పల్లకీ ఉత్సవం రాజధిరాజ
11-10-2018 హనుమంత వాహనం ఇత్తడిసప్పరం
12-10-2018 పెద్ద పల్లకీ ఉత్సవం హంస వాహనం

13-10-2018 రాజధిరాజ పెద్ద పల్లకీ

14-10-2018 హంస వాహనం ఇత్తడిసప్పరం

15-10-2018 వసంతోత్సవం గరుడవాహనం

16-10-2018 రథోత్సవం పుణ్యకోటి

17-10-2018 మృగవేట గజవాహనం

18-10-2018 వినోదోత్సవం పల్లకీ ఉత్సవం

అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు శ్రీ చక్ర పెరుమాళ్‌ చిన్న పల్లకిలో తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ప్రతిరోజూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.