BTUs OF AVULAPALLE TEMLE BEGINS _ ఆవుల‌ప‌ల్లె శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వ‌ర‌‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

Tirupati, 10 Mar. 22: TTD is organising the annual Brahmotsavam of the taken over Sri Prasanna Venkateswara temple, Avulapalle in Somala Mandal of Chittoor district.

The festivities began in Ekantam on Thursday morning with Dwajarohanam.

TTD under the supervision of DyEO Smt Shanti will organise the Brahmotsavam fete till March 18 and thereafter Shayanotsavsm on March 19.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆవుల‌ప‌ల్లె శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వ‌ర‌‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

తిరుపతి, 2022 మార్చి 10: టిటిడి ఆధీనంలోకి తీసుకున్న సోమ‌ల మండ‌లం ఆవుల‌ప‌ల్లెలోని శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వ‌ర‌‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు గురువారం ధ్వ‌జారోహ‌ణంతో ప్రారంభ‌మ‌య్యాయి. ఉద‌యం ప్రాతఃకాల ఉత్స‌వం, రాత్రి సూర్య‌ప్ర‌భ వాహ‌నసేవ నిర్వ‌హించారు. ఆలయంలో మార్చి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల మ‌రుస‌టిరోజు మార్చి 19వ తేదీన శ‌య‌నోత్స‌వం నిర్వ‌హిస్తారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

10-03-2022 (గురువారం) ధ్వజారోహణం సూర్య‌ప్ర‌భ వాహ‌నం

11-03-2022(శుక్ర‌వారం) ప్రాతఃకాల ఉత్స‌వం హ‌నుమంత వాహనం

12-03-2022(శ‌నివారం) ప్రాతఃకాల ఉత్స‌వం సింహ వాహనం

13-03-2022(ఆదివారం) ప్రాతఃకాల ఉత్స‌వం శేష‌వాహనం

14-03-2022(సోమ‌వారం) ప్రాతఃకాల ఉత్స‌వం మోహినీ ఉత్స‌వం, గ‌జ వాహ‌నం

15-03-2022(మంగ‌ళ‌వారం) ప్రాతఃకాల ఉత్స‌వం క‌ల్యాణోత్స‌వం, గ‌రుడ‌సేవ‌

16-03-2022 (బుధ‌వారం) ప్రాతఃకాల ఉత్స‌వం రథోత్సవం, డోలోత్స‌వం

17-03-2022(గురువారం) అశ్వ వాహ‌నం, పార్వేట ఉత్స‌వం డోపు ఉత్స‌వం (తిరుమంగై ఆళ్వార్‌)

18-03-2022(శుక్ర‌వారం) వసంతోత్సవం, చక్రస్నానం హంస వాహ‌నం, ధ్వజావరోహణం.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.