BUGGY DONATED _ టీటీడీకి బ్యాటరీ వాహనం విరాళం
TIRUMALA, 09 MARCH 2023: Industrial Development Bank of India (IDBI) MD and CEO Sri Rakesh Sharma has donated one buggy battery vehicle costing around Rs. 7,66,500 to TTD.
The 6 seater buggy was offered special puja in front of the temple at Tirumala on Thursday before being handed over to temple DyEO Sri Ramesh Babu.
IDBI representatives, DI Tirumala Sri Janakirami Reddy was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
టీటీడీకి బ్యాటరీ వాహనం విరాళం
తిరుమల, 2023 మార్చి 09: ఐడిబిఐ బ్యాంక్ చైర్మన్ శ్రీ రాకేష్ శర్మ గురువారం ఉదయం టీటీడీకి సుమారు రూ.7.67 లక్షల విలువైన 6-సీట్లు కలిగి బ్యాటరీతో నడిచే ఒక వాహనాన్ని విరాళంగా అందించారు.
శ్రీవారి ఆలయం ముందు వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం ఐడిబిఐ బ్యాంక్ చైర్మన్ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబుకు బ్యాటరీ వాహనం తాళాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఐడిబిఐ బ్యాంక్ ప్రతినిధులు, తిరుమల డిఐ శ్రీ జానకిరామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.