BY BRAHMOTSAVAMS ALL REST HOUSES WILL HAVE HOT WATER GEYSERS-TTD EO _ తిరుమ‌ల‌లోని అన్ని వ‌స‌తి గ‌దుల్లో వేడి నీటి సౌక‌ర్యం

ARRANGE A DIALYSIS UNIT IN ASWINI HOSPITAL-PILGRIM

 TIRUMALA, 11 AUGUST 2022: Before the annual brahmotsavams this year, all the rest houses in Tirumala will be provided with hot water geysers, said TTD EO Sri AV Dharma Reddy.

Attending to the pilgrims callers as part of Dial your EO programme held at Annamaiah Bhavan in Tirumala on Thursday, the EO responding to a pilgrim caller Sri Veera Reddy from Hyderabad, said as of now 4500 geysers are placed in the rest houses at Tirumala and before the commencement of annual brahmotsavams next month end, all the rooms, rest houses and cottages will be geared up with new hot water geysers for the sake of the pilgrims.

Another caller Sri Dinesh from Vijayawada suggested EO to set up a Dialysis Unit in Tirumala for emergency purposes. Welcoming the suggestion, the EO said the suggested will be looked into immediately.

A caller Sri Mallikarjuna Reddy from Tirupati sought EO to enable admission into TTD-run SV Balamandiram to the children who have lost either father or mother to which EO said, an appropriate decision will be taken after negotiating with the officers concerned.

Sri Venkatapathi Sastry from Hyderabad urged EO to allocate rooms to the senior citizens in the first floor considering their age factor by designing a separate software application. The EO said he will look into the possibility.

Smt Savitri from Prattikonda asked whether the children are allowed for Sevas, to which EO replied, if the children are below 12 years they will be allowed for darshan except for Abhishekam, Tomala and Archana sevas.

Sri Balachand from Vikarabad sought EO to allocate a quota of darshan tickets in IRCTC on part with RTC to which EO said the facility is already available.

A pilgrim caller Sri Marimuttu from Tamilnadu brought to the notice of TTD EO that a few devotees are carrying their children onto their shoulders which is blocking others from having Srivari darshan even for a while. Answering the caller, the EO said the problem will be resolved.

A few callers also complained to the EO that some of the staff were collecting money at Darshan, Vaikuntham, Reception areas. Responding to the pilgrim callers, TTD is regularly giving training classes to its employees in SVETA Bhavan. There is a separate Vigilance wing to look into such bribery and cheating cases when committed by a few of our own employees. “We have even lodged Disciplinary Action cases on such bad elements. But it still depends on the individual’s perception not to enter into such crimes which would not only damage the individual but also the reputation of the institution. We will definitely initiate stern action through CCTV footage on the guilty”, he maintained.

Sri Ramana Kumar from Vijayanagaram asked the EO whether they could get Abhishekam ticket which was cancelled due to Covid during last year as they have waited for 17-long years to participate in the Seva. Replying to the caller, the EO said, “Covid was an unexpected incident to all of us. The Abhishekam tickets have been booked till 2050. But you can try for the Seva through the Lucky Dip allotment system at Tirumala”, he maintained.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, SVBC CEO Sri Shanmukh Kumar and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌లోని అన్ని వ‌స‌తి గ‌దుల్లో వేడి నీటి సౌక‌ర్యం

డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2022 ఆగ‌స్టు 11: భ‌క్తుల సౌక‌ర్యార్థం సెప్టెంబ‌రు నాటికి తిరుమ‌ల‌లోని అన్ని వ‌స‌తి గ‌దుల‌లో గీజ‌ర్లు ఏర్పాటు చేయ‌నున్నాట్లు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. భావ నారాయణ – గుంటూరు

ప్రశ్న- తిరుమలలో తలనీలాలు తీయడానికి ఇబ్బంది పడుతున్నాం. మరిన్ని ప్రాంతాలలో కళ్యాణ కట్టలను ఏర్పాటు చేయగలరు?

శ్రీవారి ఆర్జిత సేవలో లక్కీ డిప్‌ విధానంలో టికెట్లు పొంద‌లేక పోతున్నాము. వర్చువల్ విధానంను ప్రవేశపెట్టి టికెట్లు ఇవ్వగలరు?

ఈవో – తిరుమలలో ప్రధాన కల్యాణ కట్టతో పాటు పది ప్రాంతాలలో మినీ కల్యాణ కట్టలు ఉన్నాయి.
ఇంకొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతాం.

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల‌ను మూడు నెలలకు ముందుగానే ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేస్తోంది. అంతేకాకుండా తిరుమలలో లక్కీ డిప్ విధానంలో కూడా అందుబాటులో ఉంచింది. ముందు రోజు ఉద‌యం పేర్లు రిజిష్ట‌ర్ చేసుకుంటే అదే రోజు సాయంత్రం 5 గంటలకు సేవా టికెట్లు కేటాయించబడుతుంది.

వర్చువల్ సేవా టికెట్లు పొందిన భ‌క్తుల‌కు రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ‌ టికెట్లు కూడా అందుబాటులో ఉంచడ‌మైన‌ది. కావున వ‌ర్చువ‌ల్ క్యూ వ‌ల‌న వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడతాయి.

2. వీరారెడ్డి – హైద‌రాబాద్

ప్రశ్న- తిరుమలలో వసతి గదులు ల‌భించ‌డం లేదు. వ‌స‌తి కొర‌కు గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉండ‌వ‌ల‌సి వ‌స్తోంతోంది. గ‌దుల‌లో వేడి నీళ్ళు రావ‌డం లేదు?

ఈవో – తిరుమలలో 7 వేల గదులు ఉన్నాయి. కరోనా తర్వాత ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు కావున ఖాళీ అయిన తర్వాతే మరొకరికి కేటాయించడం జరుగుతుంది. సెప్టెంబ‌రు నాటికి తిరుమ‌ల‌లోని అన్ని వ‌స‌తి గ‌దుల‌లో గీజ‌ర్లు ఏర్పాటు చేస్తాం.

3. దినేష్ – విజయవాడ

ప్రశ్న- అశ్విని ఆసుపత్రిలో డైయాల‌సిస్‌ ఏర్పాటు చేస్తే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది?

బ్రహ్మోత్సవాల్లో దాతలకు శ్రీ‌వారి దర్శనం కోటా కేటాయించండి?

ఈవో – తిరుప‌తి సిమ్స్‌లో డయాలసిస్ యూనిట్ ఉంది. తిరుమ‌ల‌ అశ్విని ఆసుపత్రిలో కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతాం.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు మ‌రియు పెర‌టాశి నెల కావ‌డంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కావున‌ అన్ని రకాల దర్శనాలను రద్దు చేయడమైనది.

4. శ్రీకాంత్ – మంచిర్యాల

ప్రశ్న- తిరుపతిలోని శ్రీ గోవిందరాజ‌స్వామివారి ఆల‌యంలో అర్చ‌కులు అర్చకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే నెట్టి వేస్తున్నారు?

మా గ్రామంలో 500 సంవత్సరాల పురాతన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంను ఆధునీకరిస్తున్నాం టీటీడీ తరఫున సహాయం చేయగలం చేయండి?

తిరుచానూరులో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో భద్రతా సిబ్బంది ప్రవర్తన బాగాలేదు?

ఈవో – టీటీడీ ఆలయాల్లో అర్చకులకు డబ్బులు ఇవ్వకూడదు. అలా ఎవరైనా అడిగితే చర్యలు తీసుకుంటాం. శ్రీ గోవిందరాస్వామివారి ఆల‌యంలో విమాన గోపురానికి బంగారు తాపడం పనులు జరుగుతుంది. కావున‌ బాలాలయంలో స్వామివారి దర్శనం కల్పించడమైనది.

మీ గ్రామంలోని ట్రస్టు ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధునీకరించవచ్చు. మీ ఆల‌యం టీటీడీ నిబంధనలు మేరకు ఉంటే విగ్రహాలు, ఉత్స‌వ విగ్రహాలు అందిస్తాం. అదేవిధంగా శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా నిబంధనలను అనుసరించి ఆర్థిక సహాయం చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

5. ప్రతాప్ రెడ్డి – గుంటూరు

ప్రశ్న- సెప్టెంబ‌రు 5న అమెరికా నుండి మా అబ్బాయి వస్తున్నాడు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు, వసతి దొరుకుతుందా?

ఈవో – అందుబాటులో ఉంటుంది.

6. ఝాన్సీ – హైదరాబాద్

ప్రశ్న- ఈ ఏడాది మార్చి నెల‌లో సప్తగిరి మాసపత్రికకు చందా చెల్లించాము. ఇంతవరకు రాలేదు?

ఈవో – సప్తగిరి మాస పత్రికను అత్యంత ఆకర్షణీయంగా రూపొందించాము. ఆన్‌లైన్‌లో కూడా పాఠ‌కుల‌కు అందుబాటులో ఉంచాము. మీకు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటారు.

7. సురేష్ కుమార్ – కల్వకుర్తి

ప్రశ్న – శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని, తిరుమ‌ల వ‌చ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉంటే అక్క‌డ ఉన్న‌ సిబ్బంది డ‌బ్బులు తీసుకొని మా కంటే ముందు ఉన్న కంపార్టుమెంట్ల‌లో భ‌క్తుల‌ను కూర్చోపెట్టారు?

ఈవో – విక్యూసి -2లోని సిసి కెమెరాలు ప‌రిశీలించి చర్యలు తీసుకుంటాం.

8. పరశురాం – పశ్చిమగోదావరి

ప్రశ్న- వసతి బుక్ చేసుకున్న తర్వాత తిరుమ‌ల‌కు రాకపోతే ర‌ద్దు చేసి రిఫండ్ చేయగలరు?

ఈవో – వసతి, సేవ ర‌ద్దు చేసుకుని మాకు ముందస్తు సమాచారం అందిస్తే డబ్బులు వెనుకకు రిఫండ్ చేస్తాం.

9. మల్లికార్జున్ రెడ్డి – తిరుపతి

ప్రశ్న- తిరుప‌తిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న బాల‌ మందిరంలో తల్లిదండ్రులు ఇద్ద‌రు లేని పిల్ల‌లకు మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తున్నారు. తల్లి లేదా తండ్రిల‌ల్లో ఏ ఒక్కరు లేకపోయినా ఆ పిల్లలకు అడ్మిషన్లు కల్పించగలరు?

ఈవో – ప‌రిశీలించి త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం.

10. శ్రీనివాసరావు – హైదరాబాద్

ప్రశ్న- తిరుమలలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌నం స్లాట్, సప్తగిరి అతిధి భవనంలో వ‌స‌తి బుక్ చేసుకున్నాం. గ‌ది కాళీ చేసేట‌ప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది భక్తుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు తగు చర్యలు తీసుకోగలరు ?

ఈవో – తిరుమలకు వచ్చిన భక్తులకు వసతి, దర్శనం ఏర్పాటు చేయడం అనేది టీటీడీ ప్రథ‌మ కర్తవ్యం. ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను నియంత్రించేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం ఉంది. ఇప్పటివరకు 142 ఎఫ్ఐఆర్లు, 217 మందిని అరెస్ట్, 1400 మందిని బైండోవర్ చేసి తిరుమలకు రాకుండా నిషేధించాం. 182 మంది టీటీడీ ఉద్యోగుల‌పై డిఏ కేసులు న‌మోదు చేశాం. తిరుమ‌ల‌లో విజిలెన్స్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది. టీటీడీ ఉద్యోగులకు భ‌క్తుల‌తో ప్ర‌వ‌ర్తించే విధానంపై శ్వేత‌లో ప్రత్యేకంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాం.

11. వెంకటపతి శాస్త్రి – హైదరాబాద్

ప్రశ్న- 60 సంవత్సరాల పైబడిన వృద్ధులకు, విక‌లాంగుల‌కు మొద‌టి అంత‌స్తులో వసతి కల్పించే విధంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయగలరు?

ఈవో – ప‌రిశీలిస్తాం.

12. సావిత్రి – పత్తికొండ

ప్రశ్న- ఎలక్ట్రిక్ డిప్ ద్వారా సేవా టికెట్టు పొందాము. పిల్లలను తీసుకురావ‌చ్చా?

ఈవో – 12 సంవత్సరాల్లో పిల్లలను దర్శనానికి తీసుకు వెళ్ళవచ్చు. అయితే తోమాల‌, అర్చ‌న, అభిషేకానికి అనుమ‌తించ‌రు.

13. హనుమంతరావు – హైదరాబాద్

ప్ర‌శ్న – శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌లో గరుడ పురాణం ఎప్పటినుండి ప్రసారం చేస్తారు ?

85 సంవత్సరాలు పైబడిన వ‌యో వృద్ధుల‌కు ప్రత్యేక దర్శనం కల్పించండి?

ఈవో – ప్రస్తుతం పతంజలి యోగ ద‌ర్శిని కార్య‌క్ర‌మం జరుగుతుంది. ఇది పూర్తవ్వ‌డానికి మ‌రో 3-4 నెలల స‌మ‌యం ప‌డుతుంది. తర్వాత గరుడ పురాణము పారాయణం ప్రారంభమవుతుంది.

వృద్ధులకు ప్ర‌తి రోజు ఒక గంట స్లాట్ దర్శనం కల్పిస్తున్నాము దాన్ని బుక్ చేసుకుని రావచ్చు.

14. హరీష్ – బెంగళూరు

ప్రశ్న- దాతలు ద‌ర్శ‌నానికి రాక‌పోయినా వారికి ఇచ్చే ప్రివిలేజ్ లడ్లు, వస్త్రము, బంగారు డాలరు ష‌ర‌తులు లేకుండా అందించండి ?

ఈవో – దాతలు దర్శ‌నానికి రాకపోయినా వారికి అందించే అన్ని రకాలైన ప్రివిలేజ్‌లు అందిస్తాము.

15. మారిముత్తు – చెన్నై

ప్రశ్న – శ్రీ‌వారి ఆల‌యంలో చంటి పిల్లలను భుజంపై ఎక్కించుకోవడం వల్ల వెనకాల ఉన్న వారికి స్వామి దర్శనం కనిపించడం లేదు. సన్నిధానంలో భక్తులను త్వరగా లాగేస్తున్నారు?

ఈవో – ఆల‌యంలో పిల్లలను పైకెత్తుకోకుండా అక్కడ సిబ్బంది చర్యలు తీసుకుంటారు. బయట అధిక సంఖ్యలో భక్తులు గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉంటారు కావున మీరు త్వరితగతిన‌ స్వామిని దర్శనం చేసుకుని బ‌య‌ట ఉన్న భక్తులకు అవ‌కాశం క‌ల్పించాలి. ఆల‌య సిబ్బందికి సహకరించాలి.

16. బాలచంద్ – వికారాబాద్

ప్రశ్న- తెలంగాణ ఆర్టీసీకి ఇచ్చినట్లు, ఇండియ‌న్‌ రైల్వేలో కూడా ప్ర‌యాణం చేసే భ‌క్తుల‌కు దర్శనం ఇవ్వండి ?

ఈవో – ఐఆర్‌సిటిసి ద్వారా ట్రైన్ ప్రయాణికులు దర్శనం టికెట్లు పొందవచ్చు.

17. రమణ కుమార్ – విజయనగరం

ప్రశ్న- శ్రీ‌వారి అభిషేకంకు 2004లో డబ్బులు కడితే 2021కి వచ్చింది. కరోనా కారణంగా దాన్ని రద్దు చేశారు. మళ్లీ అభిషేకం టికెట్ ఇవ్వగలరా?

ఈవో – శ్రీ‌వారి అభిషేకం టికెట్లు 2050 వరకు భ‌క్తులు బుక్ చేసుకున్నారు. అభిషేక సేవ‌ను 150 మంది మాత్రమే చూడగలరు. కావున ప్రతి గురువారం తిరుమలలో లక్కీ డిప్ ద్వారా 10 టికెట్లు కేటాయిస్తారు, గురువారం ఉదయం పేర్లు రిజిస్టర్ చేసుకుంటే టికెట్ పొంద‌వ‌చ్చు.

18. హైమావతి – తెలంగాణ

ప్రశ్న- శ్రీవారి కల్యాణోత్సవం టికెట్లు ఎప్పుడు విడుద‌ల‌ చేస్తారు ?

ఈవో – శ్రీవారి ఆర్జిత‌ సేవ టికెట్లను ప్రతి నెల ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తున్నాము.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.