GIVE INFORMATION TO PILGRIMS IN A BETTER MANNER-TTD EO_ భక్తులకు మరింత మెరుగ్గా సమాచారం అందించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 5 July 2018: TTD EO Sri Anil Kumar Singhal asked the staffs of TTD Call Centre, Information Centes and May I Help You counters to impart information to the pilgrim public in a better manner.

The EO took part on the second day of in the two-day orientation programme meant for them at SVETA building in Tirupati on Thursday. Speaking to them on this occasion, the EO said, they should have day to day up dates on the dynamic information about darshan, accommodation, transport and other amenities that are being provided to pilgrims in Tirumala and Tirupati.

He said, if anybody calls up the Call Centre on any issue related to the accommodation, the staffs should immediately connect the call to FMS Help Line.

Later he interacted with them and learnt what sort of questions and complaints are frequently asked by the pilgrims.

During these two days, the staffs were trained in communication skills, public speaking, soft skills etc,

All Projects Special Officer Sri N Muktheswara Rao, SVETA Director Col.Manda Chandrasekhar were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భక్తులకు మరింత మెరుగ్గా సమాచారం అందించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2018 జూలై 05: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు దర్శనం, వసతి, రవాణా తదితర అంశాలకు సంబంధించి మరింత మెరుగ్గా తాజా సమాచారాన్ని అందించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచించారు. టిటిడి ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతిలో గల సమాచార కేంద్రాలు, కాల్‌ సెంటర్‌ సిబ్బందికి శ్వేత భవనంలో రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఈవో మాట్లాడుతూ సిబ్బంది సంయమనంతో వ్యవహరించి స్పష్టంగా, వివరంగా సమాచారం అందించడం ద్వారా భక్తులను సంతృప్తిపరచవచ్చన్నారు. భక్తుల నుండి సలహాలు, సూచనలు, ఫిర్యాదులను సేకరించి ఆయా విభాగాల అధికారులకు తెలియజేయాలని, తద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. టిటిడిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తుల సౌకర్యార్థం తీసుకొచ్చే మార్పులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. దర్శనవేళలు, ఆర్జితసేవలు రద్దు లాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు టిటిడి వెబ్‌సైట్‌లో పొందుపరచడం ద్వారా ఎక్కువమంది భక్తులకు సమాచారం చేరుతుందన్నారు. తిరుమలలో గదులకు సంబంధించి సమస్యలపై భక్తులు కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేస్తే ఎఫ్‌ఎంఎస్‌ హెల్ప్‌లైన్‌కు కలపాలని సూచించారు. అనంతరం భక్తులు ఎలాంటి అంశాలపై ఎక్కువగా సమాచారం కోరుతున్నారనే విషయాన్ని సిబ్బందిని అడిగి ఈవో తెలుసుకున్నారు.

ఈ శిక్షణలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, పబ్లిక్‌ స్పీకింగ్‌, భక్తులు అడిగే ప్రశ్నలు, సాఫ్ట్‌ స్కిల్స్‌, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో భక్తులకు సమాచారమివ్వడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు, శ్వేత సంచాలకులు శ్రీ ఎం.చంద్రశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.