STRENGTHEN THE FUNCTIONING OF CALL CENTRE IN TTD-TIRUPATI JEO _ కాల్‌సెంటర్‌ ద్వారా భక్తులకు మరింత మెరుగైన సమాచారం అందించాలి : టిటిడి తిరుపతి జేఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 19 July 2017: While appreciating the present functioning of TTD Call Centre, Tirupati JEO Sri P Bhaskar directed the officials concerned to further strengthen the Call Centre by bringing some advanced changes in dissemination of information to pilgrim as well in the existing technology.

A review meeting was organised in the chambers of Tirupati JEO in TTD administrative building on Wednesday evening. The JEO directed the TTD PRO Dr T Ravi to come out with a comprehensive action plan on how to enhance and impart the information to pilgrims in a better way via Call Centre. He also instructed the GM Transport and the IT Wing head Sri Sesha Reddy to strengthen the technical part to send the information in an effective way to pilgrim.

The JEO also instructed to integrate the Information Counters in Tirumala also with Call Centre. “The complaints that are being lodged in our helpdesk, wattsapp, email, also should be linked up to Call Centre. The complaints should be solved by the concerned HoDs without any delay. Work out a mechanism to dispatch best possible information to the pilgrims”, he maintained.

EDP Manager Sri Bhaskar, HCL representatives Sri Hari, Sri Saikrishnan, TCS representative Sri Satya were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కాల్‌సెంటర్‌ ద్వారా భక్తులకు మరింత మెరుగైన సమాచారం అందించాలి : టిటిడి తిరుపతి జేఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2017 జూలై 19: టిటిడి కాల్‌సెంటర్‌ ద్వారా భక్తులకు మరింత మెరుగైన సమాచారం అందించాలని తిరుపతి జేఈవో శ్రీ పోల భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జేఈవో కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ కాల్‌సెంటర్‌ను మరింత బలోపేతం చేసేందుకు త్వరలో కాల్‌సెంటర్‌ సెల్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు వ్యక్తం చేస్తున్న సందేహాలను నివృత్తి చేయడంపై ఆయా విభాగాల అధికారులు దృష్టి సారించాలని సూచించారు. భక్తుల సౌకర్యాలు, సేవలకు సంబంధించి టిటిడిలో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులపై కాల్‌సెంటర్‌ సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా. టి.రవిని ఆదేశించారు. సాంకేతికపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డికి సూచించారు.

తిరుమలలోని సమాచార కేంద్రాలను కాల్‌సెంటర్‌కు అనుసంధానం చేస్తామని జేఈవో తెలిపారు. విభాగాల వారిగా అందుతున్న సూచనలు, ఫిర్యాదులను విభజించి సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కాల్‌సెంటర్‌ ద్వారా అందుతున్న భక్తుల సమస్యలను నేరుగా ఈవో దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఈ సమావేశంలో టిసిఎస్‌ అధికారులు శ్రీ సత్య, హెచ్‌సిఎల్‌ ప్రతినిధులు శ్రీ శ్రీహరి, శ్రీ సాయికృష్ణన్‌, ఈడీపీ అధికారులు శ్రీ భాస్కర్‌, శ్రీ నాదముని పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.