CANCER TSUNAMI TO HIT INDIA UNLESS WE CHANGE OUR LIFESTYLE – DOCS IN HEALTH AWARENESS CLASSES _ జీవనశైలి మార్చుకోకపోతే క్యాన్సర్ ప్రమాదం : డాక్టర్లు
TIRUPATI, 12 FEBRUARY 2023: The country is going to face the threat to be hit by a Cancer wave in the next few years unless we change our lifestyle, cautioned the doctors in the Employees’ Awareness Program.
The three-day Lifestyle Disorders and Diseases entered the second day on Sunday at Mahati Auditorium in Tirupati. During the session, the experts called on the employees to shift to healthy lifestyle habits to protect themselves from Cancerous diseases.
The second-day first session began with ”Prevention & Management of Life Style Disorders through Ayurveda”, Dr. Renu Dixit, Medical Superintendent
S.V. Ayurvedic Hospital of TTD. She explained elaborately how to overcome obesity, diabetes, hypertension, and cardiac-related ailments with the available home remedies and by consuming the proper ayurvedic products.
She also stressed on the importance of integrated medicine wherein a patient can take ayur products while undergoing allopathic treatment to prevent the further spread of disease. She also explained the importance of readily available plants like Nalleru, aloe vera, amla, Arka, jilledu, etc.
The doctor also said the TTD Ayurvedic Pharmacy Centre will soon bring out 314 products, approved by the Ministry of AYUSH into the fore for healthy living.
Later Dr. Subashini, an expert in CPR, clearly taught the importance and how to perform Cardio Pulmonary Resuscitation when the need arises by setting a mock display on the stage. She said the awareness of CPR is a must for everyone as most of them are succumbing to not receiving CPR on time.
In the last session of the day, Prof. Dr. Rani Sada Siva Murthy, Vice Chancellor of TTD-run SV Vedic University took a session on the Herbal and mantra basic health techniques for general ailments from the Vedic scriptures.
Director SVETA Smt Prasanthi, over 1500 male employees including Senior officers of TTD were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆరోగ్య క్రమశిక్షణతో మెరుగైన సమాజం : డాక్టర్ శ్రీభూషణ్ రాజు
– జీవనశైలి మార్చుకోకపోతే క్యాన్సర్ ప్రమాదం : డాక్టర్లు
– రెండో రోజుకు చేరిన టిటిడి ఉద్యోగుల అవగాహన సదస్సు
తిరుపతి, 12 ఫిబ్రవరి 2023: జీవితంలో ఆరోగ్య క్రమశిక్షణ అంతర్భాగం కావాలని, తద్వారా ఆరోగ్యకరమైన మెరుగైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని హైదరాబాదుకు చెందిన నిమ్స్ చీఫ్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపారు. జీవనశైలిని మార్చుకోకపోతే రాబోయే కొన్నేళ్లలో దేశం క్యాన్సర్ ముప్పును ఎదుర్కోక తప్పదని ఇతర వైద్యులు హెచ్చరించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టిటిడి ఉద్యోగులకు జీవనశైలి రుగ్మతలు, వ్యాధులు అనే అంశంపై జరుగుతున్న అవగాహన సదస్సు ఆదివారం రెండో రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీభూషణ్ రాజు మాట్లాడుతూ డయాబెటిస్ వ్యాధిని నిశ్శబ్ద సునామీగా అభివర్ణించారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ డయాబెటిస్ పరీక్షలు చేయించుకోవాలని, త్వరగా గుర్తిస్తే ఎక్కువ నష్టం కలగకుండా చూసుకోవచ్చని చెప్పారు. డయాబెటిస్ ఉన్నవారికి కిడ్నీ, నరాలు, గుండె, నేత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. శరీరంలో కిడ్నీలు సమర్థవంతమైన పాత్రను పోషిస్తాయని, మలినాలను తొలగించి శరీరానికి సమతాస్థితిని కలిగిస్తాయని చెప్పారు. రోజుకు ఐదుసార్లు తక్కువగా తినాలని, సాయంత్రం 6 గంటలకల్లా రాత్రి భోజనం ముగించాలని సూచించారు.
ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య విధానాల ద్వారా జీవనశైలి రుగ్మతలు, వ్యాధులను చక్కగా ఎదుర్కోవచ్చన్నారు. స్థూలకాయం, డయాబెటిస్, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులకు అందుబాటులో ఉన్న ఇంటిచిట్కాలు, ఆయుర్వేద ఔషధాలను వివరించారు. అల్లోపతి చికిత్స పొందుతున్నప్పుడు, ఆయుర్వేద వైద్యాన్ని కూడా పొందవచ్చని, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ప్రాముఖ్యతను తెలియజేశారు. నల్లేరు, కలబంద, ఉసిరి, అర్క, జిల్లేడు తదితర సులభంగా లభించే మొక్కల ప్రాముఖ్యతను ఆమె వివరించారు. ఆరోగ్యవంతమైన జీవనం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదించిన 314 ఉత్పత్తులను టిటిడి ఆయుర్వేద ఫార్మసీ త్వరలో అందుబాటులోకి తీసుకురానుందని చెప్పారు.
డాక్టర్ సుబాషిణి మాట్లాడుతూ కార్డియాక్ అరెస్ట్ అయి స్పృహ కోల్పోయిన వారికి ప్రథమ చికిత్సగా చేయాల్సిన సిపిఆర్(కార్డియో పల్మనరీ రెసిసిటేషన్) ప్రక్రియ గురించి తెలియజేశారు. ఈ విధానాన్ని వేదికపై ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. చాలా మంది సీపీఆర్‌ని సమయానికి అందుకోలేక చనిపోతున్నారని, సీపీఆర్‌పై అవగాహన అందరికీ తప్పనిసరని ఆమె అన్నారు.
ఎస్‌వి వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ సాధారణ వ్యాధులకు వేదాల్లో పేర్కొన్న మూలిక, మంత్ర ఆధారిత చికిత్స పద్ధతులను తెలియజేశారు. గరుడ పురాణంలో మానవులకు సంక్రమించే వ్యాధులు, వాటి నివారణ పద్ధతులను తెలియజేశారని చెప్పారు. అరుణ పారాయణం ద్వారా డి విటమిన్ లభిస్తుందని, మహా మృత్యుంజయ మంత్రం ద్వారా అనారోగ్యం తొలగిపోతుందని తెలియజేశారు.
స్విమ్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వనజాక్షమ్మ మాట్లాడుతూ ఒత్తిడి నివారణ ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని ఎలా అలవాటు చేసుకోవాలి అనే విషయాలను తెలియజేశారు. యోగ, ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని, తద్వారా శారీరక, మానసిక వికాసం కలుగుతుందని చెప్పారు. అనంతరం ఉద్యోగులతో ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదేక ప్రతాప్ పలు యోగాసనాలు, ముద్రలు చేసి చూపి వాటి వల్ల కలిగే ఉపయోగాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు పలు అన్నమయ్య సంకీర్తనలకు చక్కగా నృత్యాభినయం చేశారు.
ఈ కార్యక్రమంలో శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, ఇఇ శ్రీ మనోహరం, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ గోవిందరాజన్, శ్రీ ఆనందరాజు, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో పురుష ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.