KALYANA VENKATESWARA AS SARASWATI DEVI BLESSES DEVOTEES _ హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు తిరుపతి, 2025 ఫిబ్రవరి 19: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల […]
