SAHASRA KALASHABHISHEKAM AND HANUMANTHA VAHANA SEVA AT SRI KODANDARAMA SWAMY TEMPLE _ శ్రీ కోదండరామాలయంలో వైభవంగా సహస్రకలశాభిషేకం, హనుమంత వాహన సేవ
శ్రీ కోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ తిరుపతి, 2025 ఆగస్టు 23: తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో శనివారం అమావాస్య సందర్భంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరిగాయి. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా విశిష్టత ఉంటుంది. అమావాస్య నాడైన శనివారం ఉదయం 9 నుండి 10.30 గంటల నడుమ సహస్ర కలశాభిషేకం సేవ వైభవంగా నిర్వహించారు. రూ.500/- చెల్లించి పాల్గొన్న […]
