SWARNA RATHOTSAVAM HELD _ స్వర్ణరథంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి కటాక్షం
స్వర్ణరథంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి కటాక్షం • పెద్ద సంఖ్యలో రథాన్ని లాగిన మహిళలు తిరుపతి, 2026 ఫిబ్రవరి 13: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ధగధగ మెరుస్తున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి శ్రీభూదేవులు ఇరువైపుల ఉంటారు. శ్రీదేవి(లక్ష్మి) […]
