CD FOR ONLINE ACCOMMODATION BOOKING AT TIRUMALA INTRODUCED-ADL EO_ తిరుమ‌ల‌లో ఆన్‌లైన్‌లో గ‌దుల బుకింగ్‌కు కాష‌న్ డిపాజిట్ : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 15 Oct. 19: The Additional EO Sri AV Dharma Reddy said, the Caution Deposits have been reintroduced for on-line accommodation bookings in the quota released for the month of January 2020.

During the Senior Officers meeting held at Annamaiah Bhavan in Tirumala on Tuesday evening, the Additional EO of TTD reviewed on the progress of various development works in Tirumala. 

He said there is a considerable increase in cashless payments at accommodation areas. When SPRH has recorded 97%, MBC topped with Cent Percent record with swiping card payments. While in the general accommodation category, TB area recorded the highest figure of 91%, Saptagiri Rest House area 62%, SPT, Rambhageecha, CRO General nearly 50%.

Temple DyEO Sri Harindranath, Estates Officer Sri Vijayasaradhi, VGO Sri Manohar and other officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

తిరుమ‌ల‌లో ఆన్‌లైన్‌లో గ‌దుల బుకింగ్‌కు కాష‌న్ డిపాజిట్ : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2019 అక్టోబరు 15:  తిరుమ‌ల‌లో ఆన్‌లైన్‌లో గ‌దులు బుక్ చేసుకునే యాత్రికుల‌కు కాష‌న్ డిపాజిట్ విధానం 2020 జ‌న‌వ‌రి నుండి అమ‌ల్లోకి రానుంద‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వనంలో మంగ‌ళ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో అద‌న‌పు ఈవో స‌మావేశం నిర్వ‌హించారు. ప‌లు అభివృద్ధి ప‌నుల ప్ర‌గ‌తిని స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో గదుల కేటాయింపు కేంద్రాల వ‌ద్ద న‌గ‌దు ర‌హిత లావాదేవీలు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని తెలిపారు. శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహం వ‌ద్ద 97 శాతం, ఎంబిసి వ‌ద్ద 100 శాతం స్వైపింగ్ ద్వారా లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని వివ‌రించారు. సాధార‌ణ గదుల కేట‌గిరీలో టిబి కౌంట‌ర్‌లో 91 శాతం, స‌ప్త‌గిరి విశ్రాంతి గృహాల వ‌ద్ద 62 శాతం, సూరాపురంతోట‌, రాంభ‌గీచా, సిఆర్వో జ‌న‌ర‌ల్ వ‌ద్ద దాదాపు 50 శాతం న‌గ‌దు ర‌హిత లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని తెలియ‌జేశారు. అనంత‌రం విభాగాల వారీగా అభివృద్ధి ప‌నుల‌పై స‌మీక్షించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ స‌మావేశంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఎస్టేట్ అధికారి శ్రీ విజ‌య‌సార‌ధి, విఎస్‌వో శ్రీ మనోహ‌ర్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.