‘అన్నమయ్య శరణగతి విన్నపం’ సంకీర్తనల ఆవిష్కరణ


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

‘అన్నమయ్య శరణగతి విన్నపం’ సంకీర్తనల ఆవిష్కరణ

తిరుపతి, 2017 డిసెంబరు 22: శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య శరణగతి విన్నపం” సంకీర్తనలను ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.

తిరుపతి, 2017 డిసెంబరు 22: టిటిడి ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ”అన్నమయ్య శరణగతి విన్నపం” సంకీర్తనలను చెన్నైకు చెందిన ప్రముఖ గాయకులు శ్రీ శరత్‌ సంతోష్‌ మరియు హైదరాబాదుకు చెందిన శ్రీమతి శ్రీనిధి స్వరపరిచి గానం చేయగా, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ కె.రాజ సంగీతం అందించారు. ఈ సందర్భంగా కళాకారులను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం కళాకారులు ఈ సంకీర్తనలను పాడి వినిపించారు.

ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.