CELESTIAL WEDDING TOOK PLACE IN THE NEW TEMPLE AT VISAKHA _ విశాఖ శ్రీ‌వారి ఆల‌యంలో కన్నుల పండువగా శ్రీనివాస కల్యాణం

Visakhapatnam, 23 MARCH 2022: The divine wedding ceremony of the processional deities of Sridevi Bhudevi Sameta Sri Venkateswara Swamy was held with spiritual fervour in the new temple at Visakhapatnam on Wednesday evening.

 

After performing Viswaksena Aradhana, Punyahavachanam, Kankanadharana, Aganipratistha, Yajamani Sankalpam, Bhakta Sankalpam, Maha Sankalpam, the celestial nuptial knot tying ceremony took place amidst the chanting of Veda mantras by priests followed by Nakshatra Harati and Mangala Harati.

 

The devotees witnessed the divine wedding with religious ecstasy.

 

Visakha MP Sri Satyanarayana, TTD Chairman Sri YV Subba Reddy, Board Member Sri P Ashok Kumar, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam and other officials were also present.

 

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విశాఖ శ్రీ‌వారి ఆల‌యంలో కన్నుల పండువగా శ్రీనివాస కల్యాణం

తిరుపతి, 2022 మార్చి 23: విశాఖ‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీనివాసకల్యాణం క‌న్నుల పండువ‌గా జరిగింది.
మధ్యాహ్నం 3.30 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు, టీటీడీ ధర్మ కర్తల మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, విశాఖపట్నం ఎంపి శ్రీ సత్యనారాయణ, జెఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.