CENT PERCENT SUCCESS WITH TEAM WORK-EO _ బ్ర‌హ్మోత్స‌వాలను విజ‌య‌వంతం చేసిన అధికార సిబ్బందికి ధ‌న్య‌వాదాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirumala, 8 Oct. 19: Describing the annual Srivari Brahmotsavams which concluded on Tuesday as a complete success with the team work of all the departments of TTD with the co-operation from police and district administration said TTD EO Anil Kumar Singhal. 

During the press conference held at Gokulam Conference Hall on Tuesday along with Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti, the EO thanked all employees of TTD,  vigilance, volunteers, scouts, police and even VIPs for cooperating with TTD in its common pilgrim initiatives. “I sincerely thank the pilgrims for their co-operation,  patience and support and making the fete cent percent success”, he added. 

The highlights of the meeting in EO media conference:

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

బ్ర‌హ్మోత్స‌వాలను విజ‌య‌వంతం చేసిన అధికార సిబ్బందికి ధ‌న్య‌వాదాలు :  టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

అక్టోబరు 08, తిరుమ‌ల‌, 2019: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు వైభవంగా జరిగాయ‌ని, ఈ ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసిన టిటిడి అధికారుల‌కు, సిబ్బందికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమ‌ల‌లోని గోకులం విశ్రాంతి గృహంలో గ‌ల స‌మావేశ మందిరంలో టిటిడి ఈవో మంగ‌ళ‌వారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

         ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ త‌మిళులకు పవిత్రమైన పెరటాశినెల, దసరా సెలవులు రావడంతో విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి సంతృప్తికరంగా శ్రీవారి మూలమూర్తితోపాటు వాహనసేవలను దర్శించుకున్నార‌ని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, లడ్డూప్రసాదం, అన్నప్రసాదాలు, బస, భద్రత తదితర ఏర్పాట్లు చేప‌ట్టామ‌న్నారు. సామాన్య భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు స‌హ‌క‌రించిన విఐపిలకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఆ త‌రువాత బ్రహ్మోత్సవాల విశేషాల‌ను తెలియ‌జేశారు.

శ్రీవారి ఆలయం :

– 7.07 లక్షల మంది భక్తులు శ్రీవారి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.

– గరుడసేవనాడు శ్రీవారి మూలమూర్తిని 92 వేలకు పైగా దర్శించుకున్నారు.

– 7 లక్షల లడ్డూలు బఫర్‌ స్టాక్‌ ఉంచుకోవడమైనది.

– విక్రయించిన మొత్తం లడ్డూలు 34.01 లక్షలు

– హుండీ ఆదాయం రూ.20.40 కోట్లు.

– వగపడి ఆదాయం రూ. 8.82 కోట్లు.

– స్థానికులతో కలిసి 3 లక్షల మందికిపైగా భక్తులు గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకున్నారు.

వేద విద్వత్‌ సదస్సు :

– ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో దేశం నలుమూలల నుండి విచ్చేసిన ప్రముఖ పండితులతో ఆస్థానమండపంలో శ్రీ శ్రీనివాస వేద విద్వత్‌ సదస్సు నిర్వహణ.

నిఘా మరియు భద్రతా విభాగం :

– వాహనసేవలు, రథోత్సవం, చక్రస్నానంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1650 సిసిటివిలు, బాడివోర్న్‌ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు.

– 324 మంది శ్రీవారి సేవకులు, 500 మంది స్కౌట్స్‌, గైడ్స్‌, 200 మంది ఎన్‌సిసి క్యాడెట్లు, 350 మంది హోంగార్డులు, 340 మంది టిటిడి సెక్యూరిటీ గార్డులు, 27 మందితో కూడిన ఒక ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం, 24 మంది గజ ఈతగాళ్లు భక్తులకు సేవలందించారు.

– కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని వీడియో వాల్‌ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లోని భద్రతను పర్యవేక్షించాం.

– చిన్నపిల్లలు తప్పిపోకుండా 1.50 లక్షల జియోట్యాగ్‌లు.

విడిది విభాగం :

– భక్తులకు వసతి కల్పించడం వలన బ్రహ్మూెత్సవాల్లో 8 రోజులకు గాను టిటిడికి వచ్చిన ఆదాయం రూ.1.29 కోట్లు

– సామాన్య భక్తులకు అందుబాటులో ప్రతిరోజూ 4 వేల గదులు.

– ఆక్యుపెన్సీ రేటు 90 శాతంగా నమోదైంది.

– గదుల లభ్యత సమాచారాన్ని డిస్‌ప్లే బోర్డుల ద్వారా తెలియజేశాం.

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 3.23 లక్షలుగా నమోదైంది.

– 274 మంది మహిళలు, 1,046 పురుష క్షురకులతో కలిపి మొత్తం 1,320 మంది క్షురకులు 10 కల్యాణకట్టల్లో రోజుకు మూడు షిప్టుల్లో 24 గంటల పాటు భక్తులకు ఉచితంగా తలనీలాలు తీయడం జరిగింది.

అన్నప్రసాదం :

– 8 రోజుల్లో 26 లక్షల భోజనాలు, అల్పాహారం అందించడమైనది.

– 13.67 లక్షల యూనిట్ల పాలు/టీ/కాఫి భక్తులకు అందించడమైనది.

– గరుడసేవనాడు ఒకే రోజు 2.47 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 5 లక్షల తాగునీటి బాటిళ్లు అందించడం జరిగింది.

– గరుడసేవనాడు తెల్లవారుజామున 1.30 గంటల వరకు భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం పంపిణీ.

వైద్యం :

– అదనంగా 45 మంది డాక్టర్లు, 60 మంది పారామెడికల్‌ సిబ్బందిని వినియోగించడమైనది.

– భక్తులకు వైద్యసేవలందించేందుకు 12 అంబులెన్సులు ఏర్పాటు.

– తిరుమల, నడకదారుల్లో 57 వేల మందికిపైగా భక్తులకు వైద్యసేవలు.

ఆరోగ్య విభాగం :

– ఆలయ నాలుగు మాడవీధులు, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం 5,000 మంది సిబ్బంది సేవలను వినియోగించడమైనది.

– భక్తుల సౌకర్యార్థం తిరుమలలో గల 255 పబ్లిక్‌ టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడమైనది.

– గరుడసేవనాడు 210 టన్నుల చెత్త తొలగింపు.

ఇంజనీరింగ్‌ విభాగం :

– దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చొని వాహనసేవలు వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలు ఏర్పాటు.

– భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో సూచికబోర్డులు, ఫ్లెక్సీలు, రూట్‌మ్యాప్‌లు.

– వాహనాలు తిరిగే నాలుగు మాడ వీధుల కూడళ్లలో భజన మండపాలు ఏర్పాటు. వివిధ ప్రాంతాల్లో ఆర్‌ఓ తాగునీటి ప్లాంట్లు.

– చక్రస్నానం కోసం పుష్కరిణిలో ప్రత్యేక క్యూలైన్లు.

– బ్రహ్మోత్సవాల్లో 327 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం. రోజుకు సరాసరి 35 లక్షల గ్యాలన్లు.

– తిరుపతిలోని శ్రీవారిమెట్టు, అలిపిరి వద్ద కార్లు, ద్విచక్రవాహనాలకు పార్కింగ్‌ వసతి.

– తిరుమలలో 9 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్‌ ఏర్పాట్లు.

– భక్తులను ఆకర్షించే రీతిలో దాదాపు 41 దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లను రూపొందించారు. 10 ఆర్చిలను ఏర్పాటుచేశారు.

– మాడ వీధులతో పాటు వివిధ ప్రాంతాల్లో భక్తులు వాహనసేవలను వీక్షించేందుకు వీలుగా 36 ప్రాంతాల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు.

– కళాబృందాల కోసం ఆధునిక టెక్నాలజీతో యూనిఫాం సౌండ్‌ సిస్టమ్‌.

హిందూ ధర్మప్రచార పరిషత్‌, ఇతర ప్రాజెక్టులు :

– శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొత్తం హిందూధర్మప్రచార పరిషత్తు, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో 18 రాష్ట్రాల నుండి 357 కళాబృందాల్లో 8,210 మంది కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలిచ్చారు.

– ఇందులో ఇందులో గుజరాత్‌ రాష్ట్రం నుంచి గర్భ, రాజ్‌, ఛత్తీస్‌ఘడ్‌ నుండి రౌత్‌, కర్ణాటక నుండి పూజ కునిత, డొల్లు కునిత, చెక్కభజన, సమన కునిత, వీరగాసి నృత్యాలు, కేరళ నుండి పంచ్‌ వాద్యం ఉన్నాయి.

            అదేవిధంగా, హర్యాణా నుండి గ్రుమార్‌ నృత్యం, ఒడిశా నుండి సాహియాత్ర, శంకాబంధన్‌, పశ్చిమబెంగాల్‌ నుండి పురాలియ చావ్‌ను, మధ్యప్రదేశ్‌ నుండి నోర్దా, బరేడి, అఖాడా, కత్తి నృత్యాలు, పంజాబ్  రాష్ట్రం నుండి బాంగ్రా నృత్యం, రాజస్థాన్‌ నుండి అంగీ గైర్‌ నృత్యం, మణిపూర్‌ నుండి సంప్రదాయ నృత్యం, అస్సాం నుండి  బిహు నృత్యం, ఉత్తరప్రదేశ్‌ నుండి ఫర్వాహి, పూల నృత్యం, ఉత్తరాఖండ్‌ నుండి చోలియ నృత్యం, తమిళనాడు నుండి కై శిలంబాట్టం, ఒయిలాట్టం, గరగాట్టం, తప్పాట్టం, గోల్‌ కోలాట్టం, డమ్మీ హార్స్‌, దేవరాట్టం నృత్యం, పుదుచ్చేరి నుండి భరతనాట్యం, కలియాట్టం, హిమాచల్‌ ప్రదేశ్‌ నుండి స్థానిక సంప్రదాయ నృత్యం.

– కళాకారులు వాహనసేవల ముందు, తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో ప్రదర్శించిన కళాకృతులు విశేషంగా అకట్టుకున్నాయి.

– ఈ వేదికలపై ప్రముఖ కళాకారులు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి శోభానాయుడు, శ్రీ జి.బాలకృష్ణప్రసాద్‌, శ్రీమతి శోభారాజు, శ్రీ కొమండూరి రామాచారి, శ్రీ అనంతకృష్ణ తదితరులు సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు.

ఉద్యానవన విభాగం :

– శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా పుష్పాల అలంకరణలు.

– పౌరాణిక అంశాలతోపాటు రంగురంగుల పుష్పాలతో పుష్పప్రదర్శనశాల. కంచి అత్తి వరదరాజస్వామి సెట్టింగు, గరుత్మంతునిపై శ్రీ మహావిష్ణువు సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

– పలు కూడళ్లు, అతిథిగృహాల వద్ద పుష్పాలంకరణలు.

– బ్రహ్మోత్సవాల్లో సాంప్రదాయ పుష్పాలు 40 టన్నులు, 2 లక్షల కట్‌ ఫ్లవర్స్‌, దాదాపు 50 వేల సీజనల్‌ ఫ్లవర్స్‌ వినియోగం.

– పుష్పాలంకరణ పనుల కోసం 100 మంది సిబ్బంది సేవలు.

ప్రజాసంబంధాల విభాగం :

– 3 నెలల ముందు నుండి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లతోపాటు టిటిడి అందిస్తున్న వసతులు, ఉత్సవ విశేషాలపై పత్రికా ప్రకటనల ద్వారా భక్తులకు సమాచారం.

– పోస్టర్లు, బుక్‌లెట్లు, కరపత్రాలు తదితర సామగ్రి ద్వారా బ్రహ్మోత్సవాలపై ప్రచారం.

– తిరుమలలోని రాంభగీచా-2లో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌లో ఫోను, ఇంటర్నెట్‌ వసతి కల్పించడం వలన మీడియా ప్రతినిధుల ద్వారా బ్రహ్మోత్సవానికి తగిన ప్రచారం కల్పించడం జరిగింది.

– బ్రహ్మోత్సవాల వాహనసేవలు, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ప్రత్యేక కథనాలకు సంబంధించి ప్రతిరోజూ 10 నుండి 15 వరకు పత్రికా ప్రకటనలను ఈ-మెయిల్‌, వెబ్‌ ఫార్మాట్‌, వాట్సాప్‌ ద్వారా పత్రికలు, ఛానళ్లకు అందించడం జరిగింది.

– ఎస్వీబీసీ సహకారంతో మీడియా ఛానళ్లకు వాహనసేవలు, ఇతర ఉత్సవాల క్లీన్‌ఫీడ్‌.

– దేశం నలుమూలల నుండి విచ్చేసిన 3500 మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు.

– శ్రీవారి సేవకుల ద్వారా గరుడసేవనాడు ఆహారపొట్లాల తయారీ. మాడ వీధులతోపాటు క్యూలైన్లలోని భక్తులకు శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ద్వారా అన్నప్రసాదం, మజ్జిగ, తాగునీరు పంపిణీ.

ప్రచురణల విభాగం :

– భక్తుల కోసం తిరుపతి, తిరుమలలో పుస్తక విక్రయశాలలు ఏర్పాటు. సి.డిలు, డి.వి.డిలు, వివిధ భాషల ఆధ్యాత్మిక పుస్తకాలను భక్తులకు అందుబాటులో ఉంచడమైనది.

మహాప్రదర్శన  :

– తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ”మహాప్రదర్శన” పేరిట ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఫలపుష్పప్రదర్శన, ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శనతోపాటు ఎస్వీ మ్యూజియం, ఆయుర్వేద కళాశాల, శిల్పకళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనలను 2 లక్షల మందికి పైగా భక్తులు సందర్శించారు.

ఎస్వీ గోసంరక్షణశాల :

– శ్రీవారి వాహనసేవల్లో సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన ఏనుగులు, అశ్వాలు, వృషభాల వినియోగం.

– జంతువుల సహాయకులు ప్రత్యేక వస్త్రధారణలో గొడుగులతో వాహనసేవలకు మరింత వన్నె తెచ్చారు.

– జంతువుల వద్ద నైపుణ్యం గల శిక్షకుల ఏర్పాటు.

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ :

–     శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని భక్తుల కళ్లకు కట్టేలా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో రోజుకు 11 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారాలు. గరుడసేవ రోజు అంతరాయం లేకుండా 13.30 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారాలు.

– వాహనసేవల విశిష్టత అన్ని భాషల వారికి తెలిసేందుకు వీలుగా ప్రముఖ పండితులతో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వ్యాఖ్యానాలు.

– బ్రహ్మోత్సవాల విశేషాలను యుట్యూబ్‌, ఎస్వీబీసీ యాప్‌, టిటిడి వెబ్‌సైట్‌ ద్వారా భక్తులకు అందించాం.

– అధునిక సాంకేతిక పరిజ్ఞానం గల 16 హెచ్‌డి కెమెరాలు, 3 జిమ్మి జిప్‌లతోపాటు నిపుణులైన కెమెరామెన్లను ఉపయోగించడమైనది.

ఐటి :

–    టిటిడి ఐటి విభాగం అధునాతన పరిజ్ఞానంతో వేగవంతమైన సేవలందించడం ద్వారా భక్తులు దర్శనం, వసతి ఇతర సేవలను మరింత సౌకర్యవంతంగా పొందగలిగారు.

ఎపిఎస్‌ఆర్‌టిసి :

–     ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 4.29 లక్షల మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 5.70 లక్షల మంది భక్తులను చేరవేశాయి.

–     గరుడసేవనాడు ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 2503 ట్రిప్పుల్లో 93,552 మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 2248 ట్రిప్పుల్లో 68,327 మంది భక్తులను చేరవేశాయి.

జిల్లా యంత్రాంగం సేవలు :

–     టిటిడి విభాగాలతోపాటు జిల్లా యంత్రాంగం, పోలీసు, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక విభాగాలు, ఎపిఎస్‌పిడిసిఎల్‌, ఎపిఎస్‌ఆర్‌టిసి, ఆర్‌టిఓ, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బంది బ్రహ్మోత్సవాల్లో భక్తులకు విశేష సేవలందించారు.

ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.