CHAGANTI DISCOURSE ON JAN 14, 15_ జనవరి 14, 15వ తేదీల్లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసాలు

Tirupati, 7 January 2018: The religious discourse by renowned scholar, Brahmasri Chaganti Koteswara Rao will be organized by TTD in Mahati Auditorium on January 14 and 15.

The spiritual discourse will be between 6pm and 8pm on these two days.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

జనవరి 14, 15వ తేదీల్లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసాలు

తిరుపతి, 2018 జనవరి 07: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జనవరి 14, 15వ తేదీల్లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసాలు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరుగనున్నాయి.

ధర్మప్రచారంలో భాగంగా టిటిడి తరచూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలతో ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు ధార్మికోపన్యాసాలు జరుగనున్నాయి. తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని భక్తులు ఈ ధార్మికోపన్యాసాల్లో పాల్గొని ఆధ్యాత్మిక చైతన్యం పొందగలరని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.