CHAIRMAN CONDOLENCE MESSAGE _ సీనియర్ జర్నలిస్టు మబ్బు గోపాల్ రెడ్డి మృతి బాధాకరం- కుటుంబ సభ్యులను పరామర్శించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

TIRUMALA, 29 SEPTEMBER 2022: TTD Chairman Sri YV Subba Reddy extended his condolences to the bereaved family of Sri M Gopal Reddy, Senior Journalist of Tirupati who succumbed in a road accident on Wednesday night.

 

In his message, the TTD Board Chief said, Sri Gopal Reddy in his Four-decade old career Late Sri Gopal Reddy even at the ripe age of 77 used to actively participate in all events and conferences.

 

He said he will extend the support to the family of Sri Gopal Reddy.

 

EO CONSOLES FAMILY MEMBERS

 

TTD EO Sri AV Dharma Reddy consoled the family members Sri M Gopal Reddy.

 

Speaking to the late journo’s son Sri M Rajasekhar Reddy, the EO said, that his father stood as a role model in true journalism and followed the same till his last breath. I pray Sri Venkateswara Swamy to bless his soul and give enough strength to the family members. Due to Brahmotsava Kankanadharana, I could not able to attend his last rites personally. I lost a good friend who was an inspiration to many upcoming journos in strictly following journalism ethics”, he stated.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సీనియర్ జర్నలిస్టు మబ్బు గోపాల్ రెడ్డి మృతి బాధాకరం
– కుటుంబ సభ్యులను పరామర్శించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 29 సెప్టెంబరు 2022: తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు శ్రీ మబ్బు గోపాల్ రెడ్డి మరణం బాధాకరమని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు . గురువారం ఉదయం ఆయన గోపాల్ రెడ్డి కుమారుడు శ్రీ రాజశేఖరరెడ్డి ని ఫోన్ లో పరామర్శించారు.

శ్రీ గోపాల్ రెడ్డి 40 సంవత్సరాలుగా జర్నలిస్టుగా విశేష సేవలు అందించారని కొనియాడారు . 77 సంవత్సరాల వయసులో కూడా విధి నిర్వహణలోనే తనువు చాలించారని అన్నారు . నేటి తరం జర్నలిస్టులకు శ్రీ గోపాల్ రెడ్డి ఆదర్శనీయుడన్నారు . టీటీడీ తరపున శ్రీ గోపాల్ రెడ్డి కుటుంబానికి తగిన సహకారం అందిస్తామని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు . శ్రీ వేంకటేశ్వర స్వామి వారు శ్రీ గోపాల్ రెడ్డి ఆత్మకు శాంతి కలిగించాలని చైర్మన్ ప్రార్థించారు .

టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి పరామర్శ

సీనియర్ జర్నలిస్టు శ్రీ మబ్బు గోపాల్ రెడ్డి మరణం తనకు ఎంతో బాధ కలిగించిందని టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు

గురువారం ఉదయం ఆయన శ్రీ గోపాల్ రెడ్డి కుమారుడు శ్రీ రాజశేఖర్ రెడ్డి ని ఫోన్ లో పరామర్శించారు . బ్రహ్మోత్సవ కంకణం కట్టుకున్నందువల్ల నేరుగా రాలేక పోతున్నానని ఆయన చెప్పారు . శ్రీ గోపాల్ రెడ్డి వ్యక్తి గతంగా తనకు మిత్రుడని అన్నారు .విలువలతో కూడిన ఓ మంచి జర్నలిస్టును కోల్పోయామని చెప్పారు . శ్రీ గోపాల్ రెడ్డి ఆత్మకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు శాంతి ప్రసాదించాలని ఈవో ప్రార్థించారు .

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది