CHAIRMAN, EO EXTEND DEEPAVALI GREETINGS _ టిటిడి ఛైర్మన్‌, ఈవో దీపావళి శుభాకాంక్షలు

TIRUMALA, 03 NOVEMBER 2021: TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy, extended Deepavali Greetings to the devotees of Sri Venkateswara Swamy spread across the globe on Wednesday.

 

They stated that let the Diwali lights bring cheers and prosperity in all our lives with the benign blessings of Srivaru.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఛైర్మన్‌, ఈవో దీపావళి శుభాకాంక్షలు

తిరుమ‌ల‌, 2021 న‌వంబ‌రు 03: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, శ్రీవారి భక్తులకు మరియు టిటిడి ఉద్యోగుల‌కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీవారి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని బుధ‌వారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.

లోకకల్యాణార్థం నరకాసుర నరకాసుర వధ జరిగిన విధంగానే కరోనాను కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అంతం చేసి, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని వారు పేర్కొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.