CHAIRMAN OF TTD PLANTS _ నేల ‌త‌ల్లి చ‌ల్ల‌గుంటే ప్ర‌జ‌లంతా సుఖంగా ఉంటారు తిరుమ‌ల‌లో మొక్క‌లు నాటిన టిటిడి ఛైర్మ‌న్

Tirumala, 5 Jun. 20: On the occasion of World Environment Day, TTD chairman Sri YV Subba Reddy said that planting of trees was a crucial part of environmental protection activities.

Speaking to media after Planting Mahogany saplings near Swarna Tirumala Rest House, he said Lord Venkateswara had chosen His abode in Seshachala ranges which is home to enchanting flora and fauna.

He said TTD has taken up sandalwood plantation in over 100 hectares in the Seshachala forests. TTD has also taken several, innovative steps for environmental protection and preserve the wildlife and biodiversity of the regions.

TTD DFO Sri Phani Kumar Naidu, FRO Sri Shiva Kumar and other forest officials participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నేల ‌త‌ల్లి చ‌ల్ల‌గుంటే ప్ర‌జ‌లంతా సుఖంగా ఉంటారు తిరుమ‌ల‌లో మొక్క‌లు నాటిన టిటిడి ఛైర్మ‌న్

తిరుమల, 2020 జూన్ 05: నేల త‌ల్లి చ‌ల్ల‌గా ఉంటే వ‌ర్షాలు కురిసి ప్ర‌జ‌లంతా సుఖంగా ఉంటార‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి అన్నారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌టం కోసం ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటి వాటి సంర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా  శుక్ర‌వారం తిరుమ‌ల‌లోని ఛైర్మ‌న్ క్యాంపు కార్యాల‌య‌మైన స్వ‌ర్ణ తిరుమ‌ల విశ్రాంతి గృహం వ‌ద్ద మోదుగ‌, శ్రీ‌గంధం, మారేడు, ఉసిరి, తుల‌సి మొక్క‌లు నాటారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం కార‌ణంగా భూతాపం(గ్లోబ‌ల్ వార్మింగ్‌) పెరిగి వ‌ర్షాలు కుర‌వ‌క‌ ప్ర‌జ‌లు క‌రువుకాట‌కాల‌తో ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్పారు. ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణను ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా తీసుకోవాల‌న్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు శేషాచ‌ల అడ‌వుల‌ను ఆవాసంగా ఎంచుకోవ‌డం మ‌న అదృష్టమ‌ని, ఇక్క‌డ విభిన్న వ‌న్య‌ప్రాణులు, ఔష‌ధ మొక్క‌లు, అనేక జాతుల వృక్షాలు కొలువుదీరి ఉన్నాయన్నారు.  తిరుమ‌ల చుట్టుప‌క్క‌ల ఉన్న అడ‌వుల‌ను, వ‌న్య‌ప్రాణుల‌ను సంర‌క్షించ‌డం, ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌డానికి టిటిడి అనేక చ‌ర్య‌లు తీసుకుంటోందన్నారు. ప్ర‌పంచంలోనే అరుదుగా ల‌భించే ఎర్ర‌చంద‌నం వృక్షాలు శేషాచ‌లం కొండ‌ల్లో ఉన్నాయ‌ని వివ‌రించారు. లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న 2 నెల‌ల కాలంలో ప‌రిశ్ర‌మ‌ల నుంచి, వాహ‌నాల నుంచి కాలుష్యం వెలువ‌డ‌కపోవ‌డం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం ఎంత‌బాగా ఉండేదో అంద‌రూ చూశామ‌న్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌తిజ్ఞ చేసి త‌మ ఇళ్లు, కాల‌నీలు, గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో మొక్క‌లు నాటి వాటిని సంర‌క్షించ‌డాన్ని ఒక ఉద్య‌మంగా చేప‌ట్టాల‌ని ఆయ‌న కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు, ఎఫ్ఆర్వో శ్రీ శివ‌కుమార్, అట‌వీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.