CHAIRMAN VISIT APPLAYAGUNTA _ అప్పలాయగుంట ఆలయ అభివృద్ధికి చర్యలు

TIRUPATI, 09 OCTOBER 2021:  TTD Chairman Sri YV Subba Reddy on Saturday offered prayers in the temple of Sri Prasanna Venkateswara Swamy in Tirupati and also visited the newly opened Kalyana Katta in the temple premises for the sake of devotees.

Later talking to local media, he said, as many devotees are offering their vows in Appalayagunta Kalyanakatta, the officials have been instructed to increase the number of tonsurers from Sunday on wards.

When the local devotees brought to the notice of Chairman that during Saturdays and Sundays, as the devotees turn up in huge numbers, the serpentine lines are spreading outside the temple premises, forcing them to stand for hours together in queue lines under bright sun. The Chairman assured them that necessary arrangements will be taken to resolve the issue soon.

The Chairman said, the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy will be visiting the pilgrim city on October 11 to offer silk vastrams to Srivaru on Garuda Seva day on behalf of state government. He said, he will inaugurate an exclusive children’s’ hospital at BIRRD in Tirupati, the first of its kind in entire AP followed by the opening of Alipiri footpath, Go Mandiram. He will also launch Kannada and Hindi SVBC channels at Tirumala on October 12 along with Karnataka CM Sri Basavaraj Bommai for the sake of global Kannadigas and Hindi speaking devotees and also the newly constructed Boondi Potu, he added.

Earlier he had darshan of Sri Padmavathi Ammavaru at Tiruchanoor.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అప్పలాయగుంట ఆలయ అభివృద్ధికి చర్యలు

– ఆదివారం నుంచి క్షురకులను రెట్టింపు చేయాలని అధికారులకు ఆదేశం
– భక్తులకు నీడ కల్పించడానికి చర్యలు

టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 9 అక్టోబరు 2021:  అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం ఆయన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, అప్పలాయగుంట ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కల్యాణ కట్ట లో భక్తులు అధిక సంఖ్యలో తలనీలాలు సమర్పిస్తున్నారని చెప్పారు. ఆదివారం నుంచి ఈ కల్యాణ కట్టలో సిబ్బందిని రెట్టింపు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆలయంలో తగినంతమంది అర్చకులను కూడా నియమిస్తామన్నారు. శనివారం రోజు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందువల్ల స్వామివారి దర్శనం కోసం ఎండలో నిలబడాల్సి వస్తోందని భక్తులు చైర్మన్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన శ్రీ సుబ్బారెడ్డి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నీడ కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 11వ తేదీ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. తిరుపతిలో చిన్న పిల్లల గుండె జబ్బు చికిత్స ఆసుపత్రిని ప్రారంభిస్తారన్నారు. అలిపిరి నుంచి తిరుమలకు దాత నిర్మించిన పైకప్పును, అలిపిరి వద్ద మరో దాత నిర్మించిన గోమందిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.

12వ తేదీ తిరుమలలో దాత నిర్మించిన నూతన బూందీపోటును,
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కన్నడ ,హింది ఛానళ్లను ప్రారంభిస్తారనితెలిపారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవ రాజ్ బొమ్మై పాల్గొంటారని తెలిపారు. అంతకు ముందు శ్రీ సుబ్బారెడ్డి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది