CHAKRA SNANAM HELD _ వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

TIRUPATI, 18 JUNE 2022: The annual Brahmotsavams in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta entered the last day on Saturday.

Chakra Snanam was observed in the temple tank. Earlier Snapana Tirumanjanam was performed to the utsava murthies. Devotees took part in this celestial fete in large numbers which is taking place after two years due to Covid restrictions.

Temple Deputy EO Sri Lokanatham and other officials, archakas were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

తిరుపతి, 2022 జూన్ 18: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శ‌నివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9.15 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి, చక్రత్తాళ్వార్‌వారికి పుష్కరిణి ఎదురుగా వేడుకగా స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.

సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు న‌వ‌సంధి, మాడ‌వీధి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి శ్రీ‌వాణి, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.