CHAKRASNANAM HELD AT KARVETINAGARAM TEMPLE BTU _ వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామివారి చక్రస్నానం
Tirupati, 06 June 2024: As part of the valedictory event of the ongoing annual Brahmotsavam of Sri Venugopal Swamy Temple, Karvetinagaram, Chakrasnanam fete was performed on Thursday morning.
The festivities of Brahmotsavam will conclude with Dwajarohanam ever in the evening.
DyEO Smt Nagaratna, AEO Sri Parthasarathi, Superintendent Sri Somasekhar, Temple Inspector Sri Suresh were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామివారి చక్రస్నానం
తిరుపతి, 2024 జూన్ 06: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు.
ఉదయం 8 నుండి 9.15 గంటల వరకు ఆలయ సమీపంలోని స్కంధ పుష్కరిణిలో అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.
సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.