CHAKRATEERTHA MUKKOTI IN TIRUMALA ON DECEMBER 9 _ డిసెంబ‌రు 9న చ‌క్ర‌తీర్థ ముక్కోటి

Tirumala, 8 December 2019: The annual Chakrateertha Mukkoti will be observed in Tirumala on Monday at the divine water torrent Chakra Theertham by TTD.

Among the 66crore divine teerthams believed to be located in Tirumala, Chakra Teertham is said to be one of the most auspicious among the “Saptha Teerthas” (Seven) in Seshachalam ranges.

After the second bell in Srivari temple, a team of archakas, temple officials go to the holy Chakra Teertham which is located to the Southern side of the temple in deep green forests.

Special puja and abhishekam will be performed to the presiding deities of Sri Sudarshana Chakrattalwar, Sri Narasimha Swamy and Sri Anjaneya Swamy located in this holy premises.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

డిసెంబ‌రు 9న చ‌క్ర‌తీర్థ ముక్కోటి

తిరుమల, 08 డిసెంబ‌రు 2019 ; తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాల‌లో ఒక్క‌టైన చక్రతీర్థ ముక్కోటి డిసెంబ‌రు 9న సోమ‌వారం ఘనంగా జరుగనుంది.

పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న శేషగిరులమీద దక్షిణభాగంలో మహా పవిత్రతీర్థమైన చక్రతీర్థం ఉంది. ప్రతి ఏడాది తమిళ కార్తీక మాసం శుద్ధద్వాదశినాడు ఈ చక్రతీర్థ ముక్కోటి తిరుమలలో జరుగుతుంది. ఆరోజున ఉద‌యం 9.00 గంట‌ల‌కు స్వామివారు అర్చకులు, పరిచారకులు, ఉద్యోగులు, భక్తులు మరియు యాత్రికులు మంగళవాయిద్యాలతో స్వామివారు ఆలయం నుండి ప్రదక్షిణంగా చక్రతీర్థానికి వెళతారు. చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారువారికి, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం మరియు పూజ‌లు చేస్తారు. అనంతరం హారతి నివేదించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.

 స్కంద పురాణం ప్ర‌కారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు సంతసించి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ మ‌హావిష్ణువు ఆతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అటు తరువాత ఆ మహర్షి  శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది.

వరాహ పూరాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా ఉన్న సప్త తీర్థాలలో చక్ర తీర్థం ప్ర‌ముఖ తీర్థంగా వెలుగొందుతోంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.