CHAKRATTALWAR SATTUMORA OBSERVED IN SRI GT_శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ చక్రత్తాళ్వార్‌ సాత్తుమొర

Tirupati, 10 August 2018: Sri Chakrattalwar Sattumora, one of the important religious festivals in Sri Govinda Raja Swamy Temple was observed with spiritual fervour on Friday.

The importance of this fete is that the sacred disc weapon of Lord Maha Vishnu-the Sudarshana Chakrattalwar was consecrated in Sri Govindaraja Swamy temple on the auspicious day coinciding with star Pushyami in the first Gopuram of the temple .

Following the significance of the day, the Lord Sri Govindaraja Swamy flanked by his two consorts along with Chakrattalwar was taken on a celestial procession. The procession of Andal Godai was also observed later.

Sri Prativadi Bhayankara Annan was a great Sri Vaishnava Acharya who penned the famous “Suprabhatam” and also commentaries for Sri Bhashyam, Sri Bhagavatam etc. Following his birth on this auspicious day in Pushyami Star of Adi month, Sattumora was observed. Sri Varadaraja Swamy and Sri Prativadi Bhayankara Annan utsava murties were also taken on a celestial procession.

Temple DyEO Smt Varalakshmi, AEO Sri UdayBhaskar Reddy and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ చక్రత్తాళ్వార్‌ సాత్తుమొర

తిరుపతి, 2018 ఆగస్టు 10: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీచక్రత్తాళ్వార్‌ సాత్తుమొర, శ్రీప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ సాత్తుమొర ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం నుంచి ఉదయం 8.00 నుంచి 9.30 గంటల వరకు ఉభయనాంచారులతో కూడిన శ్రీ వరదరాజస్వామివారు, శ్రీ ప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు తిరుమల నుంచి వచ్చిన శ్రీవారి అప్పపడి ప్రసాదాన్ని శ్రీకోదండరామాలయం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి సాత్‌మొర నిర్వహించారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ చక్రత్తాళ్వార్‌ సాత్తుమొరసాయంత్రం 4.00 నుండి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామివారిని, శ్రీ చక్రత్తాళ్వార్‌ను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆండాళ్‌ అమ్మవారి ఊరేగింపు ఉంటుంది.

ప్రాశస్త్యం :

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని మొదటి గోపురంలో పవిత్రమైన పుష్యమి నక్షత్రం రోజున శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ప్రతిష్ఠించారు. స్వామివారి ప్రతిష్టాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ చక్రత్తాళ్వార్‌ సాత్తుమొరను ఆగస్టు 10వ తేదీ నిర్వహించారు.

శ్రీ ప్రతివాది భయంకర అన్నన్‌ కాంచిపురంలో జన్మించారు. ఆయన సంస్కృత పండితులు, శ్రీవైష్ణవాచార్యులు. తిరుమల శ్రీవారిని మేల్కొలిపే సుప్రభాతాన్ని, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనమును అద్భుతంగా రచించారు. అంతేగాక శ్రీ భాష్యం, శ్రీ భాగవతం వంటి మహా గ్రంథాలకు వ్యాఖ్యానం రచించారు. వీరి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆరోజున సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితి.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ ఉదయ్‌ భాస్కర్‌రెడ్డి, సూపరెంటెండెంట్‌ శ్రీ సురేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.