CHANDRA GRAHANAM ON JULY 17_ చంద్రగ్రహణం కారణంగా జూలై 16న రా|| 7 నుండి మరునాడు ఉ|| 5 గం||ల వరకు శ్రీవారి ఆలయం మూత

TIRUMALA TEMPLE TO BE CLOSED FROM JULY 16 NIGHT 7PM TILL JULY 17 5AM

Tirumala, 24 June 2019: In view of Chandra Grahanam which falls on July 17, the Tirumala temple will remain closed from 7pm of July 16 till 5am of July 17.

The lunar eclipse falls between 1.31am and 4.29am on July 17. But since it is a traditional practice to close the Tirumala temple six hours prior to eclipse, the temple remains closed from 6pm of July 16 till 5am of July 17.

But since, on July 17, Anivara Asthanam is also there, the Koil Alwar Tirumanjanam will be performed on July 16 between 6am and 11am. Following this fete, Asta Dala Pada Padmaradhana, Vasanthotsavam, Sahasra Deepalankara sevas are cancelled.

While on July 17, when the temple door opens at 5am after the Grahanam, suddhi punyahavachanam are performed while Suprabhatam, Tomala, Archana and Koluvu will be performed in Ekantam. The Anivara Asthanam takes place between 7am and 9am at Bangaru Vakili. The Sarva Darshanam commences from 11am onwards. TTD has cancelled Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, Vasanthotsavam and Sahasra Deepalankara Seva in connection with Anivara Asthanam on July 17.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

చంద్రగ్రహణం కారణంగా జూలై 16న రా|| 7 నుండి మరునాడు ఉ|| 5 గం||ల వరకు శ్రీవారి ఆలయం మూత

జూన్ 24, తిరుమల 2019: చంద్రగ్రహణం కారణంగా జూలై 16వ తేదీ రాత్రి 7 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 5 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం త‌లుపులు మూసివేస్తారు. ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది.

జూలై 17వ తేదీ బుధ‌వారం ఉద‌యాత్పూర్వం 1.31 నుండి 4.29 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. జూలై 17న ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది.

జూలై 16, 17వ తేదీల్లో ఆర్జితసేవలు రద్దు

జూలై 16న మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నంతోపాటు చంద్రగ్రహణం కారణంగా అష్ట‌ద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న‌, వ‌సంతోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌లు ర‌ద్ద‌య్యాయి. అదేవిధంగా జూలై 17న ఆణివార ఆస్థానం కార‌ణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.